Aryan Khan Drugs Case: డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు, సంతోషంలో బాద్‌షా ఫ్యాన్స్, 23 రోజుల్లో జరిగింది ఇదే..

ఆర్య‌న్‌తో పాటు అత‌ని స్నేహితులు అర్బాజ్ మ‌ర్చంట్‌, మున్ మున్ ధ‌మేచాకు సైతం బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

(Image Credit : Twitter)

Aryan Khan Drugs Case: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. దీంతో షారుఖ్ నివాసం మన్నత్ లో పండుగ వాతావరణం నెలకొంది. డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయిన 23 రోజుల‌కు పైగా జైలులో ఉన్న ఆర్య‌న్‌ను ఎట్ట‌కేల‌కు బెయిల్ ల‌భించింది. ఆర్య‌న్‌తో పాటు అత‌ని స్నేహితులు అర్బాజ్ మ‌ర్చంట్‌, మున్ మున్ ధ‌మేచాకు సైతం బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆర్యన్‌ రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. దాదాపు 23 రోజుల అనంతరం ఆర్యన్‌కు బెయిల్‌ రావడంతో కుటుంబ సభ్యులతో పాటు షారుఖ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉంటే షారుఖ్ కుమారుడు అక్టోబర్‌ 2వ తేదీ అర్థరాత్రి క్రూయిజ్‌ ఓడరేవులో పార్టీ జరుపుతుండగా పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ తనిఖీలో డ్రగ్స్ లభించడంతో ఆర్యన్‌తో పాటు మరో 8మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆర్యన్‌ దాదాపు 23 రోజుల పాటు జైలులోనే ఉన్నాడు. ఈ క్రమంలో అతడి బెయిల్‌ పిటిషన్‌కు ముంబై కోర్టు మూడు స్లార్లు కొట్టివేసింది. దీంతో ఆర్యన్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించగా చివరికి అతడికి ఊరట లభించింది. ఆర్యన్‌ బెయిల్‌ పటిషన్‌పై మూడు రోజుల విచారణ అనంతరం హైకోర్టు నేడు(గురువారం) ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరికి బెయిల్‌ ఇచ్చింది.



సంబంధిత వార్తలు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

Allu Arjun Reacts on Sri Tej Health: శ్రీ తేజ్ ఆరోగ్యంపై స్పందించిన అల్లు అర్జున్, ఆ కార‌ణాల‌తోనే అత‌న్ని క‌లువ‌లేక‌పోతున్నా.. అంటూ పోస్ట్

SI Suicide Case: వాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో ప్రియురాలు అరెస్ట్, రాంగ్‌ నెంబర్‌ కాల్ చేసి ఎస్‌ఐకి పరిచయం..ప్రేమ పేరుతో వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పోలీసుల వెల్లడి