Assam shocker: అసోంలో అక్కాచెళ్లెల్లపై దారుణ అత్యాచారం, తట్టుకోలేక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువతులు

జిల్లాలోని తులసిబారి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.మృతులను మమతా బేగం (19), సైమన్ నెస్సా (17)గా గుర్తించారు.

Rape (Photo-IANS)

గౌహతి, ఆగస్టు 7: అసోంలోని కమ్రూప్‌ జిల్లాలో చెట్టుకు వేలాడుతున్న ఇద్దరు యువతుల మృతదేహాలు ఆదివారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని తులసిబారి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.మృతులను మమతా బేగం (19), సైమన్ నెస్సా (17)గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసోంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లలపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అవమానాన్ని భరించలేని వారిద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.వరుసకు అక్కాచెల్లెళ్లయిన 17, 19 సంవత్సరాలున్న అమ్మాయిలపై కొందరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్ర మనస్తాపానికి గురైన వారిద్దరూ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నారు. చెట్టుకు వేలాడుతున్న వారి మృతదేహాలను చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కోనసీమలో దారుణం, తల్లి, ఇద్దరు పిల్లలను గోదావరి నదిలో తోసేసి పారిపోయిన నిందితుడు, 13 ఏళ్ల బాలికను రెస్క్యూ చేసి కాపాడిన ఏపీ పోలీసులు...

వారొచ్చి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. వారిపై అత్యాచారం జరిగిందని, అవమానం భరించలేకే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు ఏమీ మాట్లాడలేమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.