Atal Bihari Vajpayee 95th Birth Anniversary: మూడు సార్లు ప్రధాని, పోఖ్రాన్,కార్గిల్ వార్ విజయ సారధి జయంతి నేడు, అటల్ బీహారీ వాజపేయి 95వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని, రాష్ట్రపతి, రాజకీయ ప్రముఖులు, లక్నోలో అటల్ జీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ
భారత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి 95వ జయంతి(Atal Bihari Vajpayee 95th Birth Anniversary) సందర్భంగా రాజకీయ ప్రముఖులంతా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని అటల్ సమాధి వద్దకు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,(Ram Nath Kovind) ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) మాజీ ప్రధానికి నివాళులర్పించారు.
New Delhi, December 25: భారత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి 95వ జయంతి(Atal Bihari Vajpayee 95th Birth Anniversary) సందర్భంగా రాజకీయ ప్రముఖులంతా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని అటల్ సమాధి వద్దకు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,(Ram Nath Kovind) ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) మాజీ ప్రధానికి నివాళులర్పించారు.
వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా,(Amit Shah) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు.. అటల్ సమాధి వద్దకు చేరుకుని అక్కడ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
1924, డిసెంబర్ 25న మద్యప్రదేశ్‌లోని గ్వాలియర్లో జన్మించిన వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పీఠాన్ని అధిరోహించిన మొదటి నాయకుడిగా కీర్తి గడించాడు. 2018 ఆగస్టు 16న ఆయన తుదిశ్వాస విడిచారు. 1991, 1996, 1998, 1999, 2004లో లక్నో నియోజకవర్గం నుంచి లోక్‌సభకు వాజపేయి ప్రాతినిధ్యం వహించారు.
ANI Tweet
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో(Lucknow) ఏర్పాటు చేసిన వాజపేయి విగ్రహాన్ని(Vajpayee statue) ప్రధాని మోడీ ఇవాళ ఆవిష్కరించనున్నారు. వాజపేయి విగ్రహా ఆవిష్కరణ (Atal Bihari Vajpayee statue in Lucknow) నేపథ్యంలో లక్నోలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ ఎదుట పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది.
దీంతో మోడీ పర్యటనకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోడీ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోజు ఢిల్లీలో 11గంటలకు 'అటల్ భుజల్ యోజన' పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
భూగర్భ జలాల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 'అటల్ భుజల్ యోజన' పథకం తీసుకొస్తోంది. ఈ పథకాన్ని రూ.8350కోట్లతో కర్ణాటక,మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అమలుచేయనున్నారు. ఈ పథకంలో భాగంగా నీటి వినియోగదారుల సంఘాల ఏర్పాటు, భూగర్భజల డేటాను పర్యవేక్షణ, నీటి బడ్జెట్, గ్రామ పంచాయతీల వారీగా నీటి భద్రతా ప్రణాళికల రూపకల్పన, స్థిరమైన భూగర్భ జల నిర్వహణకు సంబంధించిన సమాచారం, విద్య మరియు కమ్యూనికేషన్ (ఐఇసి) కార్యకలాపాలను నిర్వహించనున్నారు.
ANI Tweet
దేశంలో బీజేపీ పార్టీని రెండు సీట్ల నుంచి అధికారానికి తీసుకువచ్చిన కాషాయపు రథసారథిగా వాజపేయిని చెప్పవచ్చు . 1980 ఏప్రిల్ 6న ఎల్ కే అద్వానీతో కలిసి వాజపేయి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. అప్పట్లో ఆయనే ఆ పార్టీకి తొలి అధ్యక్షుడిగా నియామకం అయ్యారు. తొలి నాళ్లలో రెండు సీట్లకే పరిమితం అయిన పార్టీని 1996 సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి తీసుకెళ్లిన ఘనత వాజ్ పేయి, అద్వానీలదే అని చెప్పవచ్చు.
అప్పట్లో తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాజ్ పేయి లోక్ సభలో పూర్తి మెజారిటీ రాకపోవడంతో 13 రోజులకే పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత 1998లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న ఏఐఏడీఎంకే బయటకురావడంతో ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయి ప్రభుత్వం పడిపోయింది. దీంతో 13 నెలలకే ప్రధాని పదవి నుంచి వాజ పేయి దిగిపోయారు. అనంతరం 1999 సంవత్సరంలో ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించారు.
2000లో వాజ పేయి భారతదేశంలో ఎన్నో ప్రతిష్టాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇండియాలో ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు దేశానికి ఎంతో మేలు చేశాయి. పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్టులు నిర్వహించింది కూడా వాజపేయి హయాంలోనే అని చెప్పవచ్చు. 24 ఏళ్ల సుదీర్గ కాలం తర్వాత వాజపేయి హయాంలోనే ఇండియా 1974లో న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించింది.
ప్రధానిగా ఆయన చేపట్టిన మరో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన. ఈ ప్రాజెక్టు ఫలితంగా దేశంలోని మారు మూల గ్రామాలకు, ఊళ్లకు కూడా పెద్ద పెద్ద నగరాలతో రవాణాపరంగా సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో పాటుగా భారతదేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచే 1999 కార్గిల్ వార్ కూడా వాజపేయి టైంలోనే జరిగింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)