IPL Auction 2025 Live

Crash Course in Breaking ATM: జస్ట్ 15 నిమిషాల్లో ఏటీఎం పగలగొట్టడం ఎలా? ఏకంగా దొంగలకోసం ప్రత్యేక కోర్సు పెట్టి శిక్షణ ఇస్తున్న బీహార్‌ బాబా, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి నేర్చుకుంటున్న దొంగలు

బీహార్‌(Bihar) రాష్ట్రానికి చెందిన ఓ ఏటీఎం బాబా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకు ఏటీఎంలను కేవలం 15 నిమిషాల్లో ఎలా పగలగొట్టాలనే అంశంపై(Breaking ATMs) శిక్షణ ఇచ్చి లక్నోలో ఏటీఎంల దోపిడీకి పాల్పడ్డాడు.

Representational Image

Patna, April 27: ఓ బీహార్ బాబా ఏకంగా చోరకళలో యువకులకు శిక్షణ ఇచ్చి దొంగతనాల చేయించడం ద్వారా ఉపాధి కల్పించిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.(ATM Baba) బీహార్‌(Bihar) రాష్ట్రానికి చెందిన ఓ ఏటీఎం బాబా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకు ఏటీఎంలను కేవలం 15 నిమిషాల్లో ఎలా పగలగొట్టాలనే అంశంపై(Breaking ATMs) శిక్షణ ఇచ్చి లక్నోలో ఏటీఎంల దోపిడీకి పాల్పడ్డాడు.(Thieves in UP)కేవలం 15 నిమిషాల్లో ఏటీఎంలను ఎలా పగలగొట్టాలో తెలుసుకోండి అంటూ బీహార్‌లోని ఛప్రా పట్టణంలో ‘‘ఏటీఎం బాబా’’గా పిలిచే వ్యక్తి నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చారు.ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఏటీఎం చోరీకి పాల్పడి దొరికిన పలువురు అనుమానితులను పోలీసులు విచారించగా ఏటీఎం బాబాగా పిలిచే సుధీర్ మిశ్రా పేరు వెలుగులోకి వచ్చింది.

Operation Kaveri: ఫుల్‌ జోష్‌తో ఆపరేషన్ కావేరి! ప్రత్యేక విమానంలో స్వదేశానికి మరో 360 మంది, ఇప్పటి వరకు సుడాన్‌ నుంచి తిరిగివచ్చిన వారెంతమంది అంటే? 

నిందితులు కేవలం 16 నిమిషాల వ్యవధిలో ఎస్‌బీఐ ఏటీఎం మెషీన్‌ను పగులగొట్టి 39.58 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. ఈ చోరీని మిశ్రా చేయించాడని వెలుగుచూసింది. ఏటీఎం బాబా మిశ్రాతో పాటు అతని సహచరుడు బుల్బుల్ మిశ్రా,అతని సహచరులు పోలీసులు పట్టుకున్న వారిలో ఉన్నారు.ఏప్రిల్ 3వతేదీన లక్నోలోని సుల్తాన్‌పూర్ రోడ్డు ప్రాంతంలో ఉన్న ఏటీఎం మిషన్‌ను నలుగురు దుండగుల బృందం విజయవంతంగా దోచుకెళ్లింది. క్రైం జాయింట్ పోలీస్ కమిషనర్ నీలాబ్జా చౌదరి దర్యాప్తు చేయగా సుధీర్ మిశ్రా ఈ చోరీని అతని సన్నిహిత స్నేహితుడు నీరజ్ మిశ్రాతో చేయించాడని తేలింది.

Chhattisgarh Naxal Attack: 2009 నుంచి నేటి దాకా ఛత్తీస్‌గఢ్‌‌లో నక్సల్స్ దాడి లిస్ట్ ఇదిగో, వందల మంది జవాన్లు మృతి, పూర్తి సమాచారంపై ఓ లుక్కేయండి 

మిశ్రా ఏటీఎం దోపిడీ పథకంలో మరో ముగ్గురు నిందితులు సహకరించారు.ఏటీఎం చోరీకి ముందు ఇద్దరు నిందితులు దేవాష్ పాండే, విజయ్ పాండేలు ఆ ప్రాంతంలో నిఘా పెట్టారు. అనంతరం పథకం అమలు చేసేందుకు హర్యానాలోని మేవాత్ నుంచి నలుగురు దొంగలను పిలిపించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.ఏటీఎం దోపిడీ జరిగిన సమయంలో ఏటీఎం బాబా బీహార్‌లో ఉన్నాడని, ఇతర అనుమానితులతో మొబైల్ ఫోన్ ద్వారా నిరంతరం సంప్రదింపులు జరిపాడని సమాచారం.

Madhya Pradesh: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం, ముగ్గురు చిన్నారులను బావిలో పడేసిన తల్లి, తను కూడా అదే బావిలో దూకి ఆత్మహత్య 

ఏటీఎం మెషీన్‌ను కత్తిరించేందుకు దొంగలు మూడు గ్యాస్ పైపులు, ఒక సిలిండర్ రెగ్యులేటర్, ఒక గ్యాస్ మీటర్, ఆరు హ్యాక్సా బ్లేడ్‌లు, ఒక పెద్ద క్రోబార్, రెండు శ్రావణాలు, ఒక సుత్తిని ఉపయోగించారు.నిందితులకు చోరీ చేసేందుకు ఏటీఎం బాబా సుధీర్ మిశ్రా శిక్షణ ఇచ్చారు.ఏటీఎం మెషీన్‌పై ఉన్న సీసీటీవీ కెమెరాకు చిక్కకుండా ఉండేందుకు బ్లాక్ గుడ్డను కప్పి ఉంచారు. ఇద్దరు వ్యక్తులు కూడా ఏటీఎం బయట నిలుచున్నారు. 15-16 నిమిషాల్లో నిందితులు ఏటీఎంలో చోరీ చేసి డబ్బుతో పరారయ్యారు.