Barack Obama: మహిళలకు అధికారం ఇచ్చి చూడండి, ప్రపంచమే మారిపోతుంది, సగం సమస్యలు ముసలివాళ్ల వల్లే, సోషల్ మీడియా వ‌ల్ల ఎక్కువ దుష్ప్ర‌చారం, మగవాళ్ల కన్నా ఆడవాళ్లే బెటర్ అంటున్న ఒరాక్ ఒబామా

ఆడవాళ్లను తెగ పొగిడేశాడు. వారి గురించి కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశాడు. సింగ‌పూర్‌లో (Singapore)జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఒబామా పురుషుల క‌న్నా ఆడ‌వాళ్లే చాలా నయం (Women are better leaders than men)అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

Former USA President Barack Obama. (Photo Credit: Getty)

Kuala Lumpur, December 17: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama) చాలా రోజుల తరువాత మళ్లీ వార్తల్లోకెక్కారు. ఆడవాళ్లను తెగ పొగిడేశాడు. వారి గురించి కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశాడు. సింగ‌పూర్‌లో (Singapore)జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఒబామా పురుషుల క‌న్నా ఆడ‌వాళ్లే చాలా నయం (Women are better leaders than men)అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మహిళలు ఫర్పెక్ట్ కాదంటూనే వారు మగవారి కన్నా చాలా రెట్లు నయం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎటువంటి సందేహం లేదని అలాగే వాదనలు కూడా అవసరం లేదని తెలిపారు.

ఒక‌వేళ ఈ ప్రపంచంలోని ప్ర‌తి దేశాన్ని మ‌హిళే( Women) ఏలితే.. అప్పుడు జీవ‌న ప్ర‌మాణాలు మ‌రింతగా వృద్ధి సాధిస్తాయ‌న్నారు. ప్ర‌పంచంలో చాలా వ‌ర‌కు స‌మ‌స్య‌లు వృద్ధుల వ‌ల్ల ఉత్ప‌న్నం అయ్యాయ‌ని, దాంట్లో ఎక్కువ శాతం మ‌గ‌వారు అధికారంలో ఉండ‌డం వ‌ల్ల ఆ స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

దీంతో పాటుగా సోష‌ల్ మీడియా వ‌ల్ల ఎక్కువ దుష్ప్ర‌చారం జ‌రుగుతోంద‌న్నారు. మ‌హిళ‌లు రాజ్యాధికారాన్ని చేప‌డితే, అప్పుడు ఈ ప్ర‌పంచం ఎలా ఉంటుందో అని తాను అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో ఊహించ‌కునేవాడిన‌ని బ‌రాక్ ఒబామా తెలిపారు. ప్ర‌తి దేశాన్ని ఓ రెండేళ్ల పాటు మ‌హిళ‌లు ఏలితే, అప్పుడు అన్ని రంగాల్లో పురోగ‌తి క‌నిపిస్తుంద‌న్నారు.

ఉద్యోగం చేయ‌డానికి మాత్రమే తామున్నామ‌న్న విష‌యాన్ని రాజ‌కీయ నేత‌లు గుర్తుంచుకోవాల‌ని ఒబామా అన్నారు. జీవితం మొత్తం రాజ‌కీయాలే కాదు అని తెలిపారు. వారు అధికారాన్ని అనుభ‌వించ‌డమే ల‌క్ష్యంగా పనిచేయకూడదన్నారు.