TPCC President Mahesh Kumar Goud Angry on Kishan Reddy, Bandi Sanjay(X)

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud). మతచిచ్చు పెట్టే బీజేపీ తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాదు. పరమత సహనంతో మెలిగే తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి అనే మాటను ప్రజలు కలలో కూడా ఊహించలేరు. అవన్నీ పగటి కలలేనని తేల్చిచెప్పారు.

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యం అని.. రాష్ట్ర అభివృద్ధిలో ఒక తెలంగాణ బిడ్డగా తన వంతు కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరితే ఆయన బాధ్యతా రాహిత్యంగా తప్పించుకునేలా మాట్లాడుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డా..? నేనా..? అంటూ వ్యాఖ్యానించారు9TPCC President Mahesh Kumar Goud).

ఎన్నికల సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుకు యాక్సిడెంట్.. 20 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం.. కరీంనగర్ లో ఘటన (వీడియో)

కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ తెలంగాణ బిడ్డలుగా రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు వచ్చేలా కృషి చేయాలని కోరితే పెడర్థాలు తీస్తున్నారు అని ఆరోపించారు.

TPCC President Mahesh Kumar Goud Angry on Kishan Reddy

 

బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పదేళ్లలో రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు ఎన్ని కేటాయించింది..? ఎన్ని ప్రాజెక్టులు కేటాయించింది..? రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రాజెక్టులు, సంస్థలకు ఎందుకు మెకాలడ్డుతోంది..? వీటిపై చర్చించేందుకు తెలంగాణ బీజేపీ సిద్దమా..? అని సవాలు విసురుతున్నాం అన్నారు.