Representative Image

Karimnagar, Feb 28: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Bus Accident) జరిగింది. ఎన్నికల సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుకు యాక్సిడెంట్ అయ్యింది. శుక్రవారం తెల్లవారు జామున గంగాధర ఎక్స్ రోడ్డు కొడిమ్యాల మండలం నమిళికొండ వద్ద  రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. వీరిలో బస్సు డ్రైవర సహా మరో సిబ్బందికి తీవ్ర గాయాలైనాయి. ఈ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల విధులు నిర్వహించుకుని కరీంనగర్ లో బ్యాలెట్ బాక్సులు అప్పగించేందుకు వస్తున్న నిర్మల్ జిల్లా సిబ్బంది వస్తున్న బస్సు కు ఈ ప్రమాదం జరిగింది.

సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం.. సోదరుడు రాజబాబు కన్నుమూత

కలెక్టర్ సమీక్ష

తీవ్రగాయాలైన డ్రైవర్ మోహినోద్దీన్, సిబ్బంది పురుషోత్తంకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతితో పాటు పలువురు అధికారులు దవాఖానలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇద్దరు మినహా మిగతా వారంతా స్పల్పంగా గాయపడినట్లు దవాఖాన అధికారులు చెబుతున్నారు.

నేపాల్‌ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా న‌మోదు.. వరుస భూకంపాలతో భయాందోళనలో ప్రజలు (వీడియో)