TDP Leader JC Prabhakar Reddy angry on Perni Nani(X)

Vij,December 29:  వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన జేసీ... చంద్రబాబు దయాదాక్షిణ్యాల వల్లే మీరు బతికిపోయారు అని మండిపడ్డారు. కరెంట్ చార్జీల పెంపుపై ధర్నా చేస్తారా..?, వైసీపీ హయాంలో 12 సార్లు విద్యుత్ ధరలు పెంచారు చెప్పాలన్నారు. చంద్రబాబు లేకపోతే మీ గతేంటో తెలుసా.. ? అని ధ్వజమెత్తారు.

చంద్రబాబు పాత కాలం మనిషి అని...పేర్ని నానిని వదిలేది లేదు అన్నారు. అలాంటి వాళ్లను ఉతికి ఆరేయాలి...52 వేల మెజార్టీతో ఓడిపోయిన పేర్ని నాని ఆడోళ్ల గురించి మాట్లాడతాడా? అని దుయ్యబట్టారు.నీ కుటుంబం గురించి చెబితే ఉరి వేసుకుంటావ్..పేర్ని నానికి ఆడవాళ్లంటే గౌరవం ఉందా? చెప్పాలన్నారు. ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి, వైరల్‌గా మారిన వీడియో..సీసీటీవీ వీడియో వైరల్

మా మీద కేసులు పెట్టినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్లు గుర్తుకురాలేదా?, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంచివాళ్లు కాబట్టే ఊరికే ఉన్నారు అన్నారు.నువ్వు తప్పు చేశావ్ కాబట్టే నీ మొహంలో రక్తం చుక్క లేదు అన్నారు.

JC Prabhakar Reddy slams Perni Nani