Representative Photo (Photo Credit: PTI)

Chennai, May 5: ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చూసిన తర్వాత మనుషులు మానవత్వాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని అందరికీ అర్థమవుతుంది.ఘటన ఏంటంటే.. కన్నియాకుమారి(Kanniyakumari) జిల్లాలో తాను కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న మద్యం భార్య తాగిందనే కోపంతో ఆమెను హతమార్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ రాత్రికి నీతోనే అంటూ అందమైన అమ్మాయిల ఫోటోలతో 71 ఏళ్ల వృద్ధుడికి ఎర, 4.5 లక్షలు కాజేసిన కేటుగాళ్లు, లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌ కు చెందిన కార్మికుడు డేపురాయ్‌, తన మూడో భార్య వసంతి పకాడియాతో కలసి తమిళనాడులోని కట్టలైకుళంలో నివసిస్తూ ఇటుక బట్టీలో పనికి వెళ్తున్నాడు.అయితే మద్యం షాపు నుంచి మద్యం తాగేందుకు అతను లిక్కర్ తెచ్చుకున్నాడు. అయితే అతడు తెచ్చిన మద్యాన్ని మూడో భార్య అతనికి తెలియకుండా తాగింది.

పెన్సన్ డబ్బులు ఎంజాయ్ చేయడం కోసం స్నేహితుడి శవాన్ని 2 సంవత్సరాలు ఫ్రీజర్‌‌లో ఉంచిన ఓ వ్యక్తి, నిందితుడికి అనుకూలంగా షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు

దీంతో ఆగ్రహం చెందిన అతను కట్టెతో భార్యపై తీవ్రంగా దాడిచేసి నిద్రపోయాడు. మరుసటిరోజు ఉదయం లేచేసరికి ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. అతను, భార్య మృతి చెందిందని తెలుసుకొని, ఆమె శరీరం, నేలపై పడిన రక్తపు మరకలను నీళ్లతో శుభ్రం చేశాడు. ఈ వ్యవహారంపై ఇటుక బట్టీ యజమాని ఫిర్యాదుతో పోలీసులు డేపురాయ్‌ని అరెస్టు చేశారు.