Pic Credit: IANS

Mumbai, May 3; అందమైన అమ్మాయిలతో స్నేహం, ఆనందాన్ని పొందాలనే ఆలోచన.. అమ్మాయి ఎర ఫలితంగా ముంబైకి చెందిన 71 ఏళ్ల రిటైర్డ్ అకౌంటెంట్ రూ. 4.5 లక్షలు పోగొట్టుకున్నాడు. నిజం తెలుసుకుని లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు సమతానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని సమతానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోగల ఠాగూర్‌ కాంప్లెక్స్‌లో 71 ఏళ్ల రిటైర్డ్‌ అకౌంటెంట్‌ నివాసం ఉంటున్నాడు. అందమైన అమ్మాయిలతో ఎంజాయ్‌గా గడపాలంటే ఈ నెంబర్‌కు కాల్‌ చేయండి అంటూ ఈ ఏడాది మార్చి 23న ఆయన మొబైల్‌ ఫోన్‌కు ఒక మెసేజ్‌ వచ్చింది.

కామాంధులుగా మారిన పోలీస్ కానిస్టేబుల్స్,యూపీలో యువతిని రూంలో బంధించి దారుణంగా అత్యాచారం, కేసు నమోదు చేసిన ఉన్నతాధికారులు

దాంతో ఆశపడిన వృద్ధుడు ఆ నెంబర్‌కు ఫోన్‌ చేశాడు. అవతలి నుంచి మాట్లాడిన ఓ వ్యక్తి ఐదు అందమైన అమ్మాయిల ఫొటోలను పంపి వారిలో ఒకరిని సెలెక్ట్‌ చేసుకోవాలని చెప్పారు. సెలెక్షన్‌కు ముందు రూ.2,100 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. దాంతో వృద్ధుడు రూ.2,100 చెల్లించాడు. మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 4 వరకు పలు సందర్భాల్లో వివిధ కారణాలు చెప్పి అతని నుంచి డబ్బు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు.

వరంగల్ జిల్లాలో దారుణం, మహిళను అడవిలోకి లాక్కెళ్లి ముగ్గురు సామూహిక అత్యాచారం, సహకరించిన మరో ఇద్దరు మిత్రులు

అలా మొత్తం రూ.4.5 లక్షలు చెల్లించిన తర్వాత కూడా మరికొంత డబ్బు పంపించాలని చీటర్లు డిమాండ్‌ చేశారు. దాంతో మోసపోయానని గ్రహించిన వృద్ధుడు సమతానగర్‌ పోలీసులను ఆశ్రయించాడు. దాంతో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 419, సెక్షన్‌ 420ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు