Bengaluru: బెంగళూరులో కోటి రూపాయల ఫేక్ కరెన్సీ, అమెరికా డాలర్లు, భారత్ కరెన్సీ నకిలీ నోట్లు ముద్రిస్తున్న ఇంటిపై దాడుల చేసిన పోలీసులు
పెద్దమొత్తంలో నకిలీ కరెన్సీ స్వాధీనం (fake currency notes worth over Rs 1 crore) చేసుకున్నారు.
Bengaluru, Dec 15: కర్ణాటక రాజధాని బెంగళూరులో అమెరికా డాలర్లు, భారత్ కరెన్సీ నకిలీ నోట్లు ముద్రిస్తున్న ఇంటిపై బెంగళూరు సీసీబీ పోలీసులు (Bengaluru police) బుధవారం దాడి చేశారు. పెద్దమొత్తంలో నకిలీ కరెన్సీ స్వాధీనం (fake currency notes worth over Rs 1 crore) చేసుకున్నారు. నగర జాయింట్ పోలీస్ కమిషనర్ ఎస్.డి.శరణప్ప తెలిపిన వివరాల ప్రకారం... హెణ్ణూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో భారత్, అమెరికా నకిలీ కరెన్సీ ముద్రించి మార్కెట్లోకి పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు ఆ ఇంటిపై దాడి చేశారు.
అయితే అప్పటికే ఇద్దరు నిందితులు అక్కడి నుంచి జారుకున్నారు. ఇంట్లో గాలించగా భారత్‌కు చెందిన రూ.500 నోట్లు 10,033, అమెరికాకు చెందిన వంద డాలర్ల నోట్లు 708 లభించాయి. అలాగే మరికొంత మొత్తంలో వెయ్యి రూపాయల పాత నోట్లు, ముద్రణకు వాడే రసాయనాల సీసాలు, నాలుగు కలర్ ప్రింటర్లు, ఇంక్‌జెట్ ఎల్రక్టానిక్ డైయింగ్ మెషిన్ తదితరాలు అక్కడ దొరికాయి. ఇప్పటివరకు ఎంత మొత్తంలో నోట్లను మార్కెట్లోకి తీసుకువెళ్లారనేది తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.