Bengaluru Schools Bomb Threat: బెంగళూరులో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు, అలర్ట్ అయిన పోలీసులు, అందరినీ బయటకు పంపించి క్షుణ్ణంగా సోదాలు
గుర్తుతెలియని ఒక ఈ మెయిల్ నుంచి ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వణికిపోయారు.
కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లోని పలు పాఠశాలలకు శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపులు( bomb threats) రావడం తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తుతెలియని ఒక ఈ మెయిల్ నుంచి ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వణికిపోయారు.
మీడియా కథనాల ప్రకారం..ఈ రోజు ఉదయం సుమారు 15 పాఠశాలలకు బాంబు బెదిరింపు వచ్చింది. తొలుత ఏడు స్కూళ్లకు ఈ బెదిరింపు మెయిళ్లు రాగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే మరికొన్ని విద్యాసంస్థలకు అదే తరహా ఈ మెయిళ్లు వచ్చాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాలలను నుంచి బయటకు పంపించారు. ఐటీ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్, బెంగళూరులోని ఎకోస్పేస్ బిజినెస్ పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు
Here's ANI Video
ర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసానికి ఎదురుగా ఉన్న పాఠశాలకు కూడా బెదిరింపులు వచ్చాయి. బసవేశ్వర్ నగర్‌లోని నేపెల్, విద్యాశిల్ప పాఠశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. బాంబు బెదిరింపులు బూటకమని సంకేతాలు ఉన్నప్పటికీ.. బాంబు డిస్పోసల్ స్క్వాడ్‌లు ఆ ప్రాంగణంలో క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు. ఏ పాఠశాలలోనూ బాంబులు ఉన్నట్లు వారు ఇంకా ధృవీకరించలేదు.