Pro Tem Speaker of Lok Sabha: లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా ఒడిషా ఎంపీ భర్తృహరి మహతాబ్, ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏకంగా 7 సార్లు ఎంపీగా గెలిచిన నేత
ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే.
New Delhi, June 20: లోక్ సభ ప్రొటెం స్పీకర్‌గా (Pro Tem Speaker) భర్తృహరి మహతాబ్‌ను (Bhartruhari Mahtab) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) నియమించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. కొత్తగా ఎంపికైన ఎంపీలతో ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోనున్నారు. భర్తృహరి మహతాబ్ (Bhartruhari Mahtab) ఒడిశాలోని కటక్ ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా గెలువడం ఇది ఏడోసారి కావడం విశేషం.
గతంలో ఆయన నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ పార్టీలో కొనసాగారు. ఎన్నికలకు ముందు బీజేపీ (BJP) తీర్థం స్వీకరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన మాజీ సీఎం హరేకృష్ణ మహతాబ్ తనయుడు. మహతాబ్ నియామకంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు.