Bihar: రైలులో గర్భిణికి పురుడు పోసిన హిజ్రాలు, రైలులో సాయం చేసేందుకు ముందుకు రాని ఇతర మహిళలు, హల్వారా-పాట్నా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఘటన

Halwara-Patna Janshatabdi Express ట్రైన్‌లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు హిజ్రాల బృందం (Group of eunuchs) ప్రసవం చేసి ఆమె ప్రాణాలను కాపాడింది.

Representative image of a newborn. | Image courtesy: Pixabay

Patna, Jan 18: బీహార్‌లో ట్రాన్స్‌జెండర్లు ఓ మంచి పని చేసి అందరి చేత శభాష్‌ అనిపించుకుంటున్నారు. Halwara-Patna Janshatabdi Express ట్రైన్‌లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు హిజ్రాల బృందం (Group of eunuchs) ప్రసవం చేసి ఆమె ప్రాణాలను కాపాడింది. షేక్‌పనురా జిల్లాకు చెందిన ఓ గర్భిణి తన భర్తతో కలిసి హౌరా నుంచి లఖిసరాయ్‌కు హల్వారా-పాట్నా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలులో వెళ్తోంది.

రైలు జాసిదిహ్ రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన వెంటనే మహిళకు పురిటి నొప్పులు రావడం ప్రారంభించాయి.గర్భిణి నొప్పులతో అవస్థలు పడుతున్న భార్య పరిస్థితిని గమనించిన భర్త.. సాయం కోసం కోచ్‌లోని ఇతర మహిళలను ప్రాధేయపడ్డాడు. అయితే ప్రవస వేదనతో బాధపడుతున్న మహిళకు సాయం చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. సమయం గడుస్తున్న కొద్దీ బాధితురాలి పరిస్థితి మరింత క్షీణించడం ప్రారంభించింది.

రద్దీ రోడ్డు మీద స్కూటీపైనే ఫుల్ రొమాన్స్, వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్, ఆ జంట కోసం వెతుకున్న యూపీ పోలీసులు

ఇంతలో అదే సమయానికి అటుగా వెళ్తున్న కొంతమంది హిజ్రాలు గర్భిణీ పరిస్థితిని చూసి స్పందించారు. వెంటనే గర్భిణీని రైలులోని విశ్రాంతి గదిలోకి తీసుకెళ్లారు. అక్కడే ఆమెకు ప్రసవం చేశారు. సదరు మహిళ పండంటి మగబిడ్డకు (woman deliver baby on train) జన్మనిచ్చింది. దీంతో కోచ్‌లోని ప్రతి ఒక్కరూ హిజ్రాలను అభినందించారు.