Bihar: పుల్లుగా మందు కొట్టి నగ్నంగా రోడ్డు మీద చిందులేసిన రాజకీయ నేత, సోషల్ మీడియాలో వీడియో వైరల్, సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన పోలీసులు

బీహార్‌లోని నలంద జిల్లాలో మద్యం సేవించి నగ్నంగా రోడ్లపై తిరిగిన రాజకీయ నేతను (JD(U) leader Jay Prakash Prasad) పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Police (Photo : PTI/REPRESENTATIVE)

Patna, Feb 24: బీహార్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బీహార్‌లోని నలంద జిల్లాలో మద్యం సేవించి నగ్నంగా రోడ్లపై తిరిగిన రాజకీయ నేతను (JD(U) leader Jay Prakash Prasad) పోలీసులు అరెస్ట్‌ చేశారు. అధికార పార్టీ జేడీయూ నేత జై ప్రకాష్‌ ప్రసాద్‌ అలియాస్‌ కాలు, ఇస్లాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ యువజన విభాగం ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. జగదీష్‌పూర్‌ గ్రామంలో గత రాత్రి ఆయన ఫుల్‌గా మద్యం సేవించారు. అనంతరం బట్టలన్నీ విప్పి నగ్నంగా ( roaming around drunk, naked) రోడ్డుపై సంచరించారు.

జై ప్రకాష్‌కు నచ్చజెప్పి ఇంట్లోకి రప్పించేందుకు ఆయన సోదరుడు ఎంతగానో ప్రయత్నించారు. అయినా వినని ఆ నేత రోడ్ల మీదనే చిందులేస్తూ చక్కర్లు కొట్టారు. స్థానికులు ఈ తతంగాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించాడు. తమ మొబైల్‌లో చిత్రీకరించిన వీడియో సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌ (video goes viral) అయ్యింది. ఈ విషయాన్ని స్థానికులు ఇస్లాంపూర్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. మద్యం తాగి నగ్నంగా ఉన్న జై ప్రకాష్‌కు బ్రీత్‌ అనాలిసిస్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఆయన ఫుల్‌గా మద్యం సేవించి ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

ఒంగోలులో ఇద్దరు యువతులు సహజీవనం, పోలీసులను ఆశ్రయించిన ఓ యువతి తల్లి, మేము అక్కాచెల్లెళ్లం అంటున్న యువతులు, పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ

ఇదిలా ఉంటే బీహార్‌లోని జేడీయూ-బీజేపీ కూటమి ప్రభుత్వానికి సీఎంగా ఉన్న నితీశ్‌ కుమార్‌ ఆ రాష్ట్రంలో మద్యంపై సంపూర్ణ నిషేధం విధించింది. అయితే సొంత పార్టీ నేత జై ప్రకాష్‌ ప్రసాద్‌ ఫుల్‌గా మద్యం సేవించడమే గాక నగ్నంగా రోడ్లపై తిరుగడం ఆయనకు ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ఈ ఘటనపై విమర్శల దాడి ప్రారంభించాయి.



సంబంధిత వార్తలు

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif