Representational Image (Photo Credits: Pexels)

Amaravati, Feb 24: ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇద్దరు యువతుల సహజీవనం (Cohabitation of two girls) వివాదాస్పదంగా మారింది. దీనిపై ఓ యువతి తల్లి ఇద్దరు అమ్మాయిలు(సుమలత, రమ్య) వివాహం చేసుకున్నారంటూ ఒంగోలు వన్ టౌన్ పోలీసులను( Panchayat in the police station) ఆశ్రయించింది. అయితే పోలీసులు ఈ ఘటనపై యువతులను వివరణ కోరగా.. తమ మధ్య అలాంటి సంబంధం ఏదీ లేదంటున్నారు. పైగా మేము ఇద్దరం అక్కా చెల్లెల్లా కలిసి మెలసి జీవిస్తున్నామన్నారు.

కాగా రమ్యకు మేనమామతో ఆమె తల్లి నాగమణి వివాహం చేసేందుకు సిద్దమవ్వడంతో ఆ పెళ్లి ఇష్టం లేక రమ్య తన వద్ద (same house in Ongole) ఉంటోందని సుమలత పేర్కొంది. కేవలం టిక్ టాక్‌లో రమ్య తాను కలిసి వివాహం చేసుకుంటున్నట్లు నటించిన వీడియోలు చూసి అదే నిజమైన పెళ్లిగా భావిస్తూ తమ మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు ఆమె తల్లి అపోహపడుతోందని తెలిపింది. ఇదిలా ఉండగా సుమలత నివాసంలో పనిచేసే ఆయా మాత్రం వీరిద్దరు పెళ్లి చేసుకున్న విషయం వాస్తవమేనని చెబుతోంది.

ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త, మదనపల్లె– తిరుపతి ఫోర్‌లేన్‌కు రూ.1,852.12 కోట్ల నిధులు విడుదల, ట్విట్టర్ ద్వారా తెలిపిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

ఇద్దరు మహిళల వివాహంపై తాను మందలించడంతో తనను ఇంటి పనుల్లో నుంచి తొలగిస్తామని చెప్పారని తెలిపింది. దీంతో అసలు నిజం ఏంటనే విషయంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.