Andhra Pradesh: ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త, మదనపల్లె– తిరుపతి ఫోర్‌లేన్‌కు రూ.1,852.12 కోట్ల నిధులు విడుదల, ట్విట్టర్ ద్వారా తెలిపిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
CM Jagan meets Nitin Gadkari (Photo-Twitter)

Amaravati, Feb 24: కేంద్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ఏపీ పర్యటనకు వచ్చిన కొద్ది రోజులకే శుభవార్తను అందించారు. ఆయన విజయవాడ పర్యటనలో చెప్పినట్లుగానే జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా మదనపల్లె– తిరుపతి ఫోర్‌లేన్‌కు కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు(Centre sanctions funds) చేసింది. భారత్‌మాల పరియోజన పథకం కింద రూ.1,852.12 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ( Union Minister Nitin Gadkari) బుధవారం ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ఈ నిధులతో ఎన్‌హెచ్‌–71లో తొలివిడతగా మదనపల్లె– పీలేరు మధ్య 55.9కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు (Madanapalle-Pileru four lane road) చేపట్టనున్నట్లు వివరించారు. వివేకా హత్య కేసులో కీలక మలుపు, నిందితుడు డ్రైవర్ దస్తగరి సంచలన వ్యాఖ్యలు, పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బ‌దిలీ అయిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు

కాగా తిరుపతి– మదనపల్లె ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ఘాట్‌రోడ్డుతో ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తుంటాయి. పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల ప్రజలు తిరుపతికి వెళ్లాలంటే ఈ మార్గమే శరణ్యం. ఈ క్రమంలో ఈ రోడ్డును ఫోర్‌లేన్‌గా మారిస్తే సౌకర్యంగా ఉంటుందని సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి విన్నవించారు. ఈ మేరకు ఆయన హామీ ఇచ్చారు. మాట నిలబెట్టుకునే క్రమంలో మిథున్‌రెడ్డి ఎన్‌హెచ్‌–71ను నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పరిధిలోకి మార్పించారు.

Here's Union Minister Tweet

అలాగే మార్గం మధ్యలో వచ్చే రైల్వే గేట్లకు సంబంధించి ఆర్‌ఓబీలు నిర్మించేందుకు అనుమతులు మంజూరు చేయించారు. కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని పలుమార్లు కలిసి మీడియం ప్రయారిటీలో ఉన్న ఈ ప్రాజెక్టును హై ప్రయారిటీ జోన్‌లో చేర్పించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎంపీ మిథున్‌రెడ్డి చేసిన కృషి నేడు ఫలిస్తోంది.