Bihar Shocker: గర్భవతని కూడా చూడకుండా దారుణం, కొండపై నుంచి భార్యను తోసేసిన కసాయి, చావు నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

కట్టుకున్న భార్యను గర్భవతి అని కూడా చూడకుండా భర్త చంపేశాడు. కసాయి ఆమెను కారులో బయటకు తీసుకెళ్లి సెల్ఫీ పేరుతో ఓ కొండపైకి ఎక్కించాడు. అక్కడ ఒక బండరాయితో ఆమెపై దాడిచేసి కిందకు తోసేశాడు.

Representative Photo (Photo Credit: PTI)

Patna, April 4: బీహార్‌ రాష్ట్రం, జాముయ్‌ జిల్లాలోని బాటియా వ్యాలీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను గర్భవతి అని కూడా చూడకుండా భర్త చంపేశాడు. కసాయి ఆమెను కారులో బయటకు తీసుకెళ్లి సెల్ఫీ పేరుతో ఓ కొండపైకి ఎక్కించాడు. అక్కడ ఒక బండరాయితో ఆమెపై దాడిచేసి కిందకు తోసేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. కొండపై నుంచి కింద పడగానే స్పృహ కోల్పోయిన ఆమె కొంతసేపటికి స్పృహలోకి వచ్చి స్థానికుల సాయంతో ఆస్పత్రికి చేరింది. వెంటనే చికిత్స ప్రారంభించిన వైద్యులు ఆమెకు ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.

తాగుబోతు భర్తకు 11 మంది భార్యలు, వాళ్లు వదిలేయడంతో నలుగురు పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్న ఘనుడు, తాగొచ్చి చివరకు ఆమెను కూడా చంపేశాడు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌ రంజన్‌ మిశ్రా 2019లో నిషా కుమారి (20) అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. బెగుసరాయ్‌ జిల్లాలోని సాహెబ్‌పూర్‌ కమల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోగల తారాబన్నా గ్రామంలో వారు నివాసం ఉంటున్నారు. ఇటీవలే నిషా గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే గత శనివారం రాజ్‌రంజన్‌ కొత్త కారు కొనుగోలు చేశాడు. ఆ కారుకు పూజ చేయించేందుకు ఆదివారం ఉదయం భార్యభర్తలు ఇద్దరూ కలిసి గుడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో ఉన్న ఒక కొండ దగ్గర రాజ్‌రంజన్‌ కారును ఆపాడు.

మూడు నెలల చిన్నారిని చంపి దంపతులు ఆత్మహత్య, కుటుంబ కలహాలే కారణమంటున్న స్థానికులు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఈ కొండపైన కొన్ని సెల్ఫీలు దిగుదామని చెప్పి నిషాను పైకి తీసుకెళ్లాడు. పైకి వెళ్లగానే ఆమెపై బండరాయితో దాడి చేశాడు. ఈ హఠాత్పరిణామం నుంచి ఆమె తేరుకునేలోపే కొండపై నుంచి కిందకు తోసేశాడు. దాంతో కిందపడి ఆమె స్పృహ కోల్పోయింది. అయితే నిషా చనిపోయిందని భావించిన రాజ్‌రంజన్‌ ఏమీ ఎరుగనట్టు అక్కడి నుంచి జారుకున్నాడు. కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన నిషాను స్థానికులు గమనించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు నిందితుడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఘటనకు ముందే తనకు మత్తు మందు కలిపిన చిప్స్​ తినిపించాడని, దాంతో తాను మత్తులోకి వెళ్లానని, ఆ సమయంలో తనను కొండపైకి తీసుకెళ్లి బండరాయితో కొట్టాడని, అనంతరం కిందకు తోసేశాడని బాధితురాలు చెప్పింది. స్పృహలోకి వచ్చిన తర్వాత తీవ్ర గాయాలతో రోడ్డుమీద కనిపించిన తనను స్థానికులు ఆస్పత్రికి తరలించారని తెలిపింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif