BMW CE 02 launched: బీఎండబ్ల్యూ నుంచి బీఎండబ్ల్యూ సీఈ02, భారత మార్కెట్లో విడుదల చేసిన ఆటోమొబైల్ దిగ్గజం, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

దీని ధర రూ.4.5 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది. బీఎండబ్ల్యూ సీఈ04 కంటే చౌక. బీఎండబ్ల్యూ ఆవిష్కరిస్తున్న తొలి ఎలక్ట్రిక్ టూ వీలర్ ఇది. మ్యునిచ్‌లో బీఎండబ్ల్యూ మోటరాడ్.. బీఎండబ్ల్యూ సీఈ 02 మోటారు సైకిల్‌ను డెవలప్ చేసింది.

BMW CE 02 E-Scooter Launched in India

BMW CE 02 E-Scooter Launched in India: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత్ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సీఈ02 మోటారు సైకిల్ ను ఆవిష్కరించింది. దీని ధర రూ.4.5 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది. బీఎండబ్ల్యూ సీఈ04 కంటే చౌక. బీఎండబ్ల్యూ ఆవిష్కరిస్తున్న తొలి ఎలక్ట్రిక్ టూ వీలర్ ఇది. మ్యునిచ్‌లో బీఎండబ్ల్యూ మోటరాడ్.. బీఎండబ్ల్యూ సీఈ 02 మోటారు సైకిల్‌ను డెవలప్ చేసింది.

భారత్‌లో భాగస్వామ్య సంస్థగా టీవీఎస్ మోటార్ కంపెనీ సహకారంతో హోసూర్‌లో బీఎండబ్ల్యూ సీఈ02 మోటారు సైకిల్ తయారు చేస్తున్నారు. ఎల్ఈడీ లైటింగ్, ఫ్లాట్ సింగిల్ సీట్, బ్యాటరీ, బ్లాక్ బాడీ ప్యానెల్స్ విత్ బ్లాక్ సీట్స్ విత్ బ్లాక్ అండ్ వైట్ బాడీ డెకల్స్, సీట్లపై వైట్, టీల్ స్ట్రైప్స్, ఫ్రంట్ లో గోల్డ్ అనోడైజ్డ్ ఫోర్క్స్ ఉంటాయి. స్పీడ్, బ్యాటరీ లెవల్, రేంజ్ అండ్ రైడింగ్ మోడల్ తదితర వివరాలు తెలిపేందుకు 3.5 అంగుళాల టీఎఫ్టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. సర్ఫ్, ఫ్లో రైడింగ్ మోడ్స్ లో లభిస్తుందీ.

కియా నుంచి Kia EV9, అక్టోబర్ 3న విడుదల చేయనున్న దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనం

బీఎండబ్ల్యూ సీఈ 02 పీఎంఎస్ ఎయిర్ కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు – 11కిలోవాట్లు (14.7 బీహెచ్పీ), 4 కిలోవాట్లు (5.3 బీహెచ్పీ) లలో లభిస్తుంది. రెండు 1.96 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న బీఎండబ్ల్యూ సీఈ 02 మోటారు సైకిల్ ఇంజిన్ గరిష్టంగా 14.7 బీహెచ్పీ విద్యుత్, 55 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. సింగిల్ చార్జింగ్ పూర్తి చేస్తే 108 కి.మీ దూరం ప్రయానిస్తుంది. మూడు సెకన్లలో గంటకు 50 కి.మీ వేగం, గరిష్టంగా గంటకు 95 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 0.9 కిలోవాట్ల హై లైన్ ప్యాకేజీ చార్జింగ్, 1.5 కిలోవాట్ల చార్జింగ్ పవర్ తోపాటు క్విక్ చార్జర్ ఉంటాయి.