Bomb Threat To Home Ministry: కేంద్ర హోంశాఖను పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్, అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం, ఫేక్ అని నిర్థారణ
దేశ రాజధానిలో అమిత్‌షా (Amit Shah) నియంత్రణలోని హోంశాఖను (Ministry Of Home Affairs) పేల్చేస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు.
న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ పోలీస్ కంట్రోల్ రూంకు బుధవారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దేశ రాజధానిలో అమిత్‌షా (Amit Shah) నియంత్రణలోని హోంశాఖను (Ministry Of Home Affairs) పేల్చేస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు ఈమెయిల్ చేసినట్లు మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఉగ్రవాదులతో విరాట్ కోహ్లీ ప్రాణాలకు ముప్పు, ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు చేసుకున్న ఆర్సీబీ, నేడు కీలక ఎలిమినేటర్ మ్యాచ్
ఈ ఘటనపై మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం వెంటనే నార్త్ బ్లాక్‌లోని రెడ్ స్టోన్ బిల్డింగ్ వద్దకు చేరుకొని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. బాంబ్ స్వ్కాడ్, జాగిలాల సాయంతో బిల్డింగ్ మొత్తం తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులూ, పేలుడు పదార్థాలూ దొరకలేదు. ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈమెయిల్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.