BRS MLAs Arrest: రాహుల్ గాంధీ ఆదాని టీషర్ట్ ధరించి పార్లమెంట్ కు వెళ్లాడు, మేము ధరించి అసెంబ్లీకి వస్తే తప్పేంటి ? అరెస్టులపై మండిపడిన బీఆర్ఎస్ నేతలు

తెలంగాణ అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ శాసనసభ్యులు సోమవారం ఉదయం నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది . సెషన్ ప్రారంభానికి నిమిషాల ముందు ఈ నిరసన చెలరేగింది.

KTR Arrest (Photo/X/BRS)

Hyd, Dec 9: తెలంగాణ అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ శాసనసభ్యులు సోమవారం ఉదయం నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది . సెషన్ ప్రారంభానికి నిమిషాల ముందు ఈ నిరసన చెలరేగింది. ఈ నేపథ్యంలో టి హరీష్ రావు , కె కవిత, ఇతరులతో సహా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్టు చేశారు. నాయకులను సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సోమవారం ఉదయం దీక్షా విజయ్‌ దివస్‌ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి, అదానీ ఫొటోతో కూడిన టీషర్టులను ధరించి అసెంబ్లీకి బయల్దేరారు. దీంతో అసెంబ్లీ గేటు-2 వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్, అదానీతో కూడిన టీషర్టు ధరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొన్నది.BRS శాసనసభ్యులు 'రేవంత్-అదానీ భాయ్ భాయ్' నినాదంతో కూడిన టీ-షర్టులు, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో పాటు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి చిత్రాలను ధరించి రావడంతో వివాదం మొదలైంది. టీ షర్ట్స్‌ తీసివేసి లోపలకు రావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు కోరారు. అయితే వారు ససేమిరా అనడంతో అరెస్ట్ చేసి, స్టేషన్ కు తరలించారు.

అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.. కారణం ఇదే..! (వీడియో)

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR), మాజీ మంత్రి హరీశ్‌రావు (HarishRao) ఆగ్రహం వ్యక్తంచేశారు. కేటీఆర్ మాట్లాడుతూ పార్లమెంట్‌కు రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ ఎంపీలు అదానీ ఫొటో ఉన్న టీషర్టులు ధరించి వెళ్లారన్నారు. ‘‘లగచర్ల ప్రజల తరఫున నిరసన తెలిపేందుకు సభకు వెళ్తున్నాం.

BRS legislators arrested after flash protest at Telangana Assembly entrance

బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల తరఫున పోరాడతాం. నడిరోడ్డుపైనే ఎమ్మెల్యేలను అడ్డుకోవడం సమంజసమా? అదానీకి కాంగ్రెస్‌ నేతలు దాసోహం అంటున్నారు. అదానీ-రేవంత్‌ బంధాన్ని బయటపెడతాం. పోలీసులను అడ్డుపెట్టుకొని సభకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్‌ నేతలు దిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ కడుతున్నారు. ఆ పార్టీ దుర్మార్గ వైఖరికి వ్యతిరేకంగా అసెంబ్లీలో నిరసన తెలుపుతాం’’అని చెప్పారు.

హరీశ్‌రావు మాట్లాడుతూ ‘‘అదానీ ఫొటో ఉన్న టీషర్టులు ధరించి కాంగ్రెస్‌ నేతలు పార్లమెంట్‌కు వెళ్లారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ నేతలు ఆ టీషర్టులు వేసుకొని వెళ్తే మీకు ఫర్వాలేదు. రాష్ట్రంలో మేం నిరసన తెలుపుతూ టీషర్టులు ధరిస్తే మీకు ఇబ్బందేంటి? రాహుల్‌గాంధీకి ఒక నీతి.. రేవంత్‌రెడ్డికి మరో నీతి ఉంటుందా? కాంగ్రెస్‌ పార్టీకి ఒక సిద్ధాంతం లేదా? రాష్ట్రంలో దుర్మార్గ, అరాచక పాలన సాగుతోంది. ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు యత్నిస్తున్నారు. సభలో ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయాలని ఎవరైనా ఉద్యమాలు చేశారా? కొత్తగా రూపొందించిన విగ్రహంలో బతుకమ్మను తొలగించి చెయ్యి గుర్తు పెట్టారు. అలా చేయడం తెలంగాణ మహిళలను కించపరచడమే. రాష్ట్ర ప్రజలకు ఇది అవమానం. కేసీఆర్‌పై కుట్రతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని మండిపడ్డారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Advertisement
Advertisement
Share Now
Advertisement