Akash Anand: మేన‌ల్లుడిపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి, అత‌నే త‌న వార‌సుడంటూ ప్ర‌క‌ట‌న‌

తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను (Akash Anand) తిరిగి నియమించారు. పార్టీ జాతీయ సమన్వయకర్త బాధ్యతలు కూడా అతడికి అప్పగించారు. ఆదివారం లక్నోలో జరిగిన పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.

Former Uttar Pradesh CM Mayawati and nephew Akash Anand (File Photo Credits: ANI)

Lucknow, June 23: ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను (Akash Anand) తిరిగి నియమించారు. పార్టీ జాతీయ సమన్వయకర్త బాధ్యతలు కూడా అతడికి అప్పగించారు. ఆదివారం లక్నోలో జరిగిన పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. 2019లో సమాజ్‌వాదీ పార్టీ (SP)తో తెగతెంపులు చేసుకున్న తర్వాత పార్టీ పటిష్టంపై మాయావతి (Mayawati) దృష్టిసారించారు. మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా (Bahujan Samaj Party’s National Coordinator) నియమించారు. గత ఏడాది డిసెంబర్‌లో తన రాజకీయ వారసుడిగా అతడ్ని ఎంపిక చేశారు.

 

కాగా, ఈ  ఏడాది మే నెలలో మాయావతి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జాతీయ కోఆర్డినేటర్ పదవి నుంచి, వారసుడిగాను ఆకాష్ ఆనంద్‌ను తొలగించారు. రాజకీయ పరిపక్వత వచ్చే వరకు ఆ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల బీఎస్పీ నేతలు ఆశ్చర్యపోయారు. మరోవైపు 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ 10 సీట్లు దక్కించుకుంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో మేనల్లుడు ఆకాష్‌ ఆనంద్‌ను మరోసారి జాతీయ సమన్వయకర్తగా నియమించడంతోపాటు తన వారసుడిగా మాయావతి ప్రకటించారు.



సంబంధిత వార్తలు