
Hyderabad, March 01: రేపట్నుంచి పవిత్ర రంజాన్ మాసం (Ramzan Month) ప్రారంభవుతున్న సందర్భంగా ముస్లిం సోదరులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్యాత్మికతను, జీవిత పరమార్థాన్ని ఎరుకపరిచి, క్రమశిక్షణను పెంపొదిస్తామని అన్నారు. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ జన జీవనం దర్పణంగా నిలుస్తుందని కేసీఆర్ అన్నారు.
ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పలు కార్యక్రమాల ద్వారా, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణకు మనం దేశానికే ఆదర్శంగా నిలిచామని, అదే వారసత్వాన్ని కొనసాగించాలని తెలిపారు.