Bullet Mystery Case: వెన్నునొప్పితో ఆసుపత్రిలో చేరితే డాక్టర్లకే షాక్, ఆమె శరీరంలో బుల్లెట్‌ను గుర్తించిన నిమ్స్ వైద్యులు, కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పంజాగుట్ట పోలీసులు

ఆస్మా బేగం తండ్రి గతంలో ఫలక్ నుమాలోని ఓ ఫంక్షన్ హాల్ లో వాచ్ మెన్ గా పని చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఏదైనా వేడుకలో భాగంగా ఎవరైనా గాల్లోకి కాల్పులు జరిపినపుడు పొరపాటున ఆస్మా శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లిందా...?

Bullet Mystery Case: వెన్నునొప్పితో ఆసుపత్రిలో చేరితే డాక్టర్లకే షాక్, ఆమె శరీరంలో బుల్లెట్‌ను గుర్తించిన నిమ్స్ వైద్యులు, కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పంజాగుట్ట పోలీసులు
Image used for representation purpose only | Photo: PTI

Hyderabad, December 24: తీవ్ర వెన్నునొప్పి (Backache) తో ఆసుపత్రిలో చేరిన ఆమెకు, స్కానింగ్ నిర్వహించిన వైద్యులు ఆమె శరీరంలో బుల్లెట్ (Bullet) ను చూసి షాక్ అయ్యారు. హైదరాబాద్ లోని పాతబస్తీకి చెందిన ఆస్మా బేగం అనే 19 ఏళ్ల టీనేజ్ మహిళ గత రెండేళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతుంది. ఎన్నిరకాలుగా ప్రయత్నించిన నొప్పి తగ్గకపోవడంతో ఇటీవల నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS- Nizam Institute of Medical Sciences) లో చేరింది. ఆమె శరీరంలో వెనుపూస భాగంలో ఉండిపోయిన బుల్లెట్ ను గుర్తించిన వైద్యులు శనివారం ఆమెకు శస్త్ర చికిత్స చేసి బుల్లెట్ ను తొలగించారు. దీనిపై సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు (Punjagutta Police)  వెంటనే అప్రమత్తమై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.

సోమవారం, టాస్క్ ఫోర్స్ కమిషనర్ మరియు పంజాగుట్ట పోలీసుల బృందాలు ఈ సంఘటనపై విచారణ జరిపాయి. ఆమె శరీంలోకి బుల్లెట్ ఎలా వెళ్లింది అనే విషయంపై ఆ మహిళను మరియు ఆమె కుటుంబ సభ్యులను ప్రశ్నించినపుడు తమకేమి తెలియదని చెప్పుకొచ్చారు. అయితే, వారు కావాలనే విషయాన్ని దాచిపెడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కాల్చిన వ్యక్తి నుంచి డబ్బు తీసుకొని, ఒక

పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఈ విషయంపై సీరియస్ గా దృష్టిపెట్టాయి. రెండు టీమ్స్ కలిసి కేసు దర్యాప్తును వేగవంతం చేశాయి.  ఆస్మా బేగం తండ్రి కొన్నేళ్లుగా ఒక రియల్టర్ దగ్గర పనిచేస్తున్నాడు. గతంలో ఫలక్ నుమాలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వాచ్‌మ్యాన్‌గా పని చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఏదైనా వేడుకలో భాగంగా ఎవరైనా గాల్లోకి కాల్పులు జరిపినపుడు పొరపాటున ఆస్మా శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె శరీరంలో దిగిన బుల్లెట్ కూడా నాటు తుపాకీ నుంచి బయటకు వచ్చిందనే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే విషయం బయటపడకుండా ఆ కాల్చిన వ్యక్తి వీరితో ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవడం వల్లనే ఆస్మా మరియు ఆమె కుటుంబ సభ్యులు విషయాన్ని దాచిపెడుతున్నారా? అనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

ఆ బుల్లెట్‌ను పరీక్షల ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) కు పంపినట్లు పంజాగుట్ట ఎసిపి తిరుపత్తన్న తెలిపారు. "దానిపై నివేదిక అందిన తరువాత, బుల్లెట్ తయారీ మరియు ఉపయోగించిన ఆయుధం గురించి మాకు సమాచారం లభిస్తుంది. ఈ కేసును వీలైనంత త్వరగా ఛేదించటానికి మా టీమ్స్ కృషి చేస్తున్నాయి" అని తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)



సంబంధిత వార్తలు

Assam: పిక్నిక్‌ వెళ్లి ఆవును కోసుకొని తిన్న యువకులు, సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయడంతో చెలరేగిన దుమారం, ఆరుగురు అరెస్ట్

Hezbollah Leader Sheikh Muhammad Ali Hamadi Shot Dead: హిజ్బుల్లా కమాండర్‌ హతం, కుటుంబ కలహాలతో కాల్చి చంపినట్లు అంతర్జాయ కథనాలు

Hyderabad Horror: హైదరాబాద్‌లో దారుణం, భార్యను చంపి డెడ్ బాడీని కుక్కర్ లో ఉడకించి ముక్కలను పొడి చేసిన భర్త, చివరకు ఎలా దొరికాడంటే..

Cold Wave in Telangana: తెలంగాణను వణికిస్తున్న చలి. ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

Share Us