Kharif Marketing Season 2022-23: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు, 17 పంటలకు కనీస మద్దతు ధర పెంపు, ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వేసే పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం

ఈ క్రమంలో రైతులకు మోదీ సర్కార్ శుభవార్త అందించింది. 17 పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ బుధవారం కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రారంభమవుతున్న ఖరీఫ్ సీజన్‌లో వేసే పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Union Minister Anurag Thakur (Photo Credits: Twitter)

New Delhi, June 8: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో రైతులకు మోదీ సర్కార్ శుభవార్త అందించింది. 17 పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ బుధవారం కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రారంభమవుతున్న ఖరీఫ్ సీజన్‌లో వేసే పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ న్యూఢిల్లీలో వెల్లడించారు.

సోయాబీన్ క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.300, కందులు క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.300, పెసర్లు క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.480 పెంచారు. నువ్వులు క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.523, పొద్దుతిరుగుడు క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ. 385 పెంచారు.  మళ్లీ పోరేటును పెంచేసిన RBI, అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు తప్పదంటున్న గవర్నర్ శక్తికాంత దాస్, వడ్డీ రేట్లు పెరిగే అవకాశం

పెంచిన ధరల వివరాలు

వరి రూ.2040, వరి ఏ గ్రేడ్ రూ.2060, జొన్న రూ.2970 , ఏ గ్రేడ్ రూ. 2990, సజ్జలు రూ. 2350, రాగి రూ.3578, మొక్క జొన్న. 1962, కందిపప్పు 6600, పెసరపప్పు 7755, మినపప్పు 6600, వేరు శనగ 5850, ప్రొద్దుతిరుగుడు 6400, సోయాబీన్ 4300, నువ్వులు 7830, పత్తి 6080, పత్తి పొడవు రకం 6380, నైగర్ సీడ్ 7287



సంబంధిత వార్తలు