IPL Auction 2025 Live

Candida Auris Fungus: మళ్లీ కరోనా కన్నా డేంజరస్ వైరస్, భారీ సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం, క్యాండిడా ఆరిస్‌ వస్తే బతికే అవకాశాలు తక్కువంటున్న శాస్త్రవేత్తలు, మానవాళి మళ్లీ సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు

క్యాండిడా ఆరిస్‌ బారిన పడితే బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, వ్యాప్తి మొదలైతే పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని తీవ్ర హెచ్చరికలు చేశారు.

Candida auris (Photo Credits: CDC)

London, Feb 3: కోవిడ్ కల్లోలానికి ప్రపంచం ఏడాది పాటు చీకటిలోకి వెళ్లిపోయిన విషయం విదితమే. అది సరికొత్తగా తన రూపాలను సంతరించుకుంటూ ( New coronavirus strain ) ఇప్పటికీ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దాని విశ్వరూపానికి కొన్ని దేశాలు మళ్లీ లాక్ డౌన్ విధించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్‌ సహా కొన్ని దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలైనప్పటికీ... కోవిడ్‌-19 భయాల నుంచి ఇప్పటికీ కొందరు తేరుకోలేపోతున్నారు.

కోవిడ్ వ్యాక్సినేషన్ కొన్ని చోట్ల ప్రతికూల ఫలితాలు ఇవ్వడంతో వ్యాక్సిన్ ( Vaccination ) సమర్థవంతంగా పనిచేస్తుందా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ ( Imperial College ) శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసే మరో భయంకరమైన వార్త చెప్పారు. ‘‘క్యాండిడా ఆరిస్‌’’ (Candida Auris Fungus) అనే ఫంగస్‌ కోవిడ్‌ కంటే కూడా ఎన్నోరెట్లు ప్రమాదకరమైనదని హెచ్చరించారు.

ఒకే వ్యక్తిలో రెండు రకాల కరోనావైరస్‌లు, నివ్వెరపోతున్న శాస్త్రవేత్తలు, బ్రెజిల్‌లో పీ1, పీ2 కరోనా రకాలు గుర్తింపు, ఇండియాలో తాజాగా 11,039 మందికి కోవిడ్, ఏపీలో 104 మందికి కరోనా పాజిటివ్

కాండిడా ఆరిస్ ఫంగస్ (Candida Auris) రక్తంలోకి ప్రవేశిస్తే, ఎలాంటి విరుగుడుకు లొంగదని, ప్లేగు తరహాలో వ్యాపించే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు. క్యాండిడా ఆరిస్‌ బారిన పడితే బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, వ్యాప్తి మొదలైతే పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని తీవ్ర హెచ్చరికలు చేశారు. 2016లోనే ఇంగ్లండ్‌లో దీని ఆనవాలు గుర్తించామని, ఎలాంటి వాతావరణంలోనైనా జీవించగల సామర్థ్యం దీనికి ఉంటుందని తెలిపారు. కోతుల ద్వారా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎపిడెమిలాజిస్ట్‌ జొహాన్న రోడ్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనాపై పోరాడిన యోధుడు చివరకు దానికే బలయ్యాడు, కోవిడ్‌పై పోరు కోసం రూ.318 కోట్ల విరాళాలను సేకరించిన కెప్టెన్‌ టామ్‌ మూర్‌ కన్నుమూత, సంతాపం వ్యక్తం చేసిన పలువురు

బ్లాక్ ప్లేగును పోలి ఉండే ఫంగస్ "కాండిడా ఆరిస్" వల్ల తదుపరి వల్ల జాగ్రత్తగా ఉండకపోతే మరో మహమ్మారిని ప్రపంచం ఎదుర్కోక తప్పదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసిపి) శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కాండిడా ఆరిస్' ఫంగస్ చాలా ప్రమాదకరమైనదని, ఇది వేగంగా వ్యాప్తి చెందుతున్నందున కరోనావైరస్ కంటే ప్రమాదకర అంటువ్యాధని క్షణాల్లో మనిషిని బలహీనుడును చేస్తుందని వారు హెచ్చరించారు. దీన్ని Candida auris or C. auris అని పిలుస్తారు. 2009లో తొలిసారిగా దీన్ని జపాన్ లో కనుగొన్నారు. అయితే దీని ప్రారంభ జాతిని 1996లో దక్షిణ కొరియాలో కనుగొన్నట్లుగా తెలుస్తోంది.