Cardiologist Dies of Heart Attack: విధి ఎంత చిత్రమైనది, వేలమందికి గుండె సర్జరీలతో ప్రాణదానం, చివరకు అదే గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ

రోజు మాదిరిగానే ఆసుపత్రిలో రోగులను చూసిన ఆయన సోమవారం రాత్రి ప్యాలెస్ రోడ్‌లోని తన నివాసానికి వెళ్లారు. భోజనం చేసిన తర్వాత నిద్రపోయారు.

Cardiologist Gaurav Gandhi (Photo-Facebook)

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సుమారు 16,000కు పైగా గుండె సర్జరీలు చేసి వేలాది మంది ప్రాణాలను కాపాడిన ప్రముఖ కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ అదే గుండెపోటుతో మరణించారు. రోజు మాదిరిగానే ఆసుపత్రిలో రోగులను చూసిన ఆయన సోమవారం రాత్రి ప్యాలెస్ రోడ్‌లోని తన నివాసానికి వెళ్లారు. భోజనం చేసిన తర్వాత నిద్రపోయారు.

అయితే మంగళవారం ఉదయానికి చనిపోయారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారణ అయ్యిది.వేలకు పైగా గుండె ఆపరేషన్లు చేసి ఎందరో రోగుల ప్రాణాలను కాపాడిన కార్డియాలజిస్ట్‌ గౌరవ్‌ గాంధీ, 41 ఏళ్ల వయసులో గుండెపోటుతో చనిపోవడం గురించి తెలుసుకుని ఆయన కుటుంబ సభ్యులతోపాటు తోటి డాక్టర్లు విషాదంలో మునిగిపోయారు.

ఈ 5 అలవాట్లే గుండెపోటుకు ప్రధాన శత్రువులు, వీటిని కంట్రోల్ చేసుకుంటే మీ గుండె పదిలంగా ఉంటుందని చెబుతున్న నిపుణులు

జామ్‌నగర్‌లో తన ప్రాథమిక వైద్య పట్టా పొందిన తర్వాత, డాక్టర్ గౌరవ్ గాంధీ తన వైద్య అభ్యాసాన్ని స్థాపించడానికి తన స్వగ్రామానికి తిరిగి వచ్చే ముందు అహ్మదాబాద్‌లో కార్డియాలజీలో స్పెషలైజేషన్‌ను అభ్యసించారు. Facebookలో 'హాల్ట్ హార్ట్ ఎటాక్స్' (https://www.facebook.com/HaltHeartAttack) క్యాంపెయిన్‌లో చురుగ్గా పాల్గొనడం ద్వారా గుండె ఆరోగ్యం, నివారణ వ్యూహాలను ప్రోత్సహించడంలో అతను తన తిరుగులేని నిబద్ధతను చూపించాడు. ఈ ప్రచారంలో డాక్టర్ గాంధీ పాల్గొనడం, హృదయ ఆరోగ్యం గురించి అవగాహన పెంచడానికి మరియు ఇతరులకు అవగాహన కల్పించడానికి అతని అంకితభావాన్ని హైలైట్ చేసింది.



సంబంధిత వార్తలు

Fake Cop Video Calls Real Cyber Security Police: సైబ‌ర్ క్రిమిన‌ల్ కు లైవ్ లో షాక్ ఇచ్చిన పోలీసులు, యూనిఫాంతో ఏకంగా రియ‌ల్ పోలీస్ కే ఫోన్ చేసిన కేటుగాడు.. ఆ త‌ర్వాత ఏమైందంటే?

Telangana Horror: సంగారెడ్డి జిల్లాలో దారుణం, అందరూ చూస్తుండగానే రోడ్డుపై తల్లి, కొడుకులను కత్తితో నరికిన దుండగులు, పాతకక్షలే కారణం

KTR: కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారని ప్రచారం?, భారీగా కేటీఆర్‌ ఇంటికి బీఆర్ఎస్ నేతలు, ఎవనిదిరా కుట్ర..ఏంది ఆ కుట్ర? అని మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,నిజానికి ఉన్న దమ్మేంటో చూద్దామని సవాల్

Patnam Narender Reddy Remand Report: కలెక్ట‌ర్ పై దాడి ఘ‌ట‌న వెనుక కేటీఆర్ హ‌స్తం! ప‌ట్నం న‌రేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీల‌క విష‌యాలు