Covid in India: కరోనా సోకిన వారికి యాంటీ బయాటిక్స్‌ వాడొద్దు, కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ, దేశంలో కొత్తగా 699 మందికి కొవిడ్‌ పాజిటివ్‌

కొవిడ్‌ బారిన పడిన పెద్దల చికిత్సకు లొపినావిర్‌-రిటోనావిర్‌, హైడ్రాక్సిక్లోరోక్విన్‌, ఐవెర్‌మెక్టిన్‌, మోల్నుపిరవిర్‌, ఫావిపిరావిర్‌, అజిత్రోమైసిన్‌, డాక్సీసైక్లిన్‌ ఔషధాలు వినియోగించవద్దని ఆదేశాలిచ్చింది. బాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉంటే తప్ప యాంటీ బయాటిక్స్‌ వాడొద్దని సూచించింది

Representational (Credits: Twitter/ANI)

దేశంలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్‌ బారిన పడిన పెద్దల చికిత్సకు లొపినావిర్‌-రిటోనావిర్‌, హైడ్రాక్సిక్లోరోక్విన్‌, ఐవెర్‌మెక్టిన్‌, మోల్నుపిరవిర్‌, ఫావిపిరావిర్‌, అజిత్రోమైసిన్‌, డాక్సీసైక్లిన్‌ ఔషధాలు వినియోగించవద్దని ఆదేశాలిచ్చింది. బాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉంటే తప్ప యాంటీ బయాటిక్స్‌ వాడొద్దని సూచించింది.

అలాగే ప్లాస్మా థెరఫీ కూడా చేయవద్దని సూచించింది. వ్యాధి తీవ్రత మధ్యస్తంగా లేదా తీవ్రంగా ఉంటే, రోగి ఆక్సిజన్‌ సహాయంతో ఉంటే ఐదు రోజుల పాటు రెమెడిసివిర్‌ వాడొచ్చని పేర్కొన్నది. వ్యాధి లక్షణాలు ప్రారంభమైన 10 రోజుల్లోపే వినియోగించాలని, ఐఎంవీ, ఎక్మో మీద ఉన్న వారికి ఇవ్వొద్దని సూచించింది. ఐసీయూలో చేర్చిన 24-48 గంటల్లో టోసిలిజుమాబ్‌ వినియోగించవచ్చని సూచించింది.

కరోనా పోయింది బర్డ్‌ ఫ్లూ మొదలైంది, 10 మందికి సోకితే అందులో 5 మంది మృతి, మరో మహమ్మరిగా ఇది అవతరించబోతుందని శాస్త్రవేత్తలు ఆందోళన

దేశంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Ministry of Health) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 97,866 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా… 699 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,46,96,984 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 6,559 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో ఒడిశా (1), కేరళ (1)లో ఇద్దరు మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 5,30,808కి చేరింది. కరోనా మహమ్మారి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 4,41,59,617 మంది కోలుకున్నారు.

కరోనా ఇంకా పోలేదు, ఒమిక్రాన్ ఉపవేరియంట్ XBB.1.5తో పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్న నిపుణులు

ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.01 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.79 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.