Corona Guidelines Extended: కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం, ఆగస్టు 31 వరకు కోవిడ్ గైడ్‌లైన్స్ పొడిగింపు, అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, కరోనా నియమాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు

ఆగస్టు 31 వరకూ ‘కరోనా గైడ్‌లైన్స్’ (Corona Guidelines Extended) అమలులో ఉంటాయని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా (Union Home Secretary Ajay Bhalla) ప్రకటించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆయన లేఖ రాశారు.

Cops Test Corona Positive (Photo-PTI)

New Delhi, July 28:  కరోనావైరస్ నియమ నిబంధనల కాలాన్ని కేంద్ర హోంశాఖ (Ministry of Home Affairs) పొడిగించింది. ఆగస్టు 31 వరకూ ‘కరోనా గైడ్‌లైన్స్’ (Corona Guidelines Extended) అమలులో ఉంటాయని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా (Union Home Secretary Ajay Bhalla) ప్రకటించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆయన లేఖ రాశారు.

కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కరోనా నియమాలను కఠినంగా అమలు చేయాలని హోంశాఖ సూచించింది. రానున్న రోజుల్లో పండగలు రాబోతున్నాయని, ప్రజల రద్దీని నియంత్రిస్తూ, నియమాలు (Centre Extends COVID Guidelines) అమలయ్యేలా చూడాలని కూడా కోరింది.

పాజిటివిటీ రేటు తగ్గుతున్న ప్రాంతాల్లో క్రమంగా కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని, అయితే కేసులు మాత్రం పూర్తిగా తగ్గలేదన్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని సూచించింది. అందుకే నిర్లక్ష్యంతో వ్యహరించకూడదని, కరోనా నియమాలను కచ్చితంగా పాటించేలా చూడాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను కోరింది. దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రత ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. మూడో ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో ఈశాన్య రాష్ట్రాలతోపాటు కేరళలో వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా ఉండడంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది.

కేంద్రం నుండి రూ. 15 లక్షలు గెలుచుకునే అవకాశం, మీరు చేయవలిసిందల్లా పేరు, ట్యాగ్‌లైన్‌, లోగోను సూచించడమే, పోటీకి సంబంధించిన వివరాలను MyGovIndia ట్విట్టర్లో పొందుపరిచిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

మిగతా రాష్ట్రాల్లో రోజువారీగా వందల సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవుతుంటే కేరళలో మాత్రం నిత్యం 10వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. దీంతో కేరళలో కొవిడ్‌ పరిస్థితులు చేజారిపోయినట్లు కనిపిస్తున్నాయని ఆరోగ్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా వెలుగు చూసిన తొలి నాళ్లలో కేరళ తీసుకున్న వైరస్‌ కట్టడి చర్యలను ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) కూడా కొనియాడింది.కానీ, ప్రస్తుతం అక్కడి పరిస్థితులు తారుమారయ్యాయి.