Centre Caution To Social Media Platforms: ఫేక్ బాంబు బెదిరింపుల‌పై సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ల‌కు కేంద్రం హెచ్చ‌రిక‌, వారిని గుర్తించే ప‌ని మీదే అంటూ ఆదేశాలు

ఇలాంటి బెదిరింపుల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ శనివారం ఆదేశించింది.

Fake Calls Alert (Credits: X)

New Delhi, OCT 26: ఇటీవల దేశీయ విమానాలతోపాటు అంతర్జాతీయ విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు (Fake Bomb Threats) భారీగా పెరిగాయి. గత 10 రోజుల్లోనే 250కి పైగా భారతీయ విమానాలకు బాంబు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. బెదిరింపులు విమానయాలన సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ లైన్లకు వరుసగా బెదిరింపులు రావడంతో కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి బెదిరింపుల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను (Social Media Platforms) కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ శనివారం ఆదేశించింది. కేంద్రం ఆదేశాలను ధిక్కరించినట్లయితే థర్డ్‌ పార్టీ కంటెంట్‌ను ఆయా ప్లాట్‌ఫామ్‌లు తీసుకునే వెసులుబాటును నిలిపివేస్తామని స్పష్టం చేసింది.

Telangana: నాగార్జునసాగర్ హైవేపై పోలీసులకు - బెటాలియన్ పోలీసు కుటుంబాలకు మధ్య తోపులాట..భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్, బ్రిటిష్ కాలం నాటి విధానాలను మార్చాలని డిమాండ్ 

నకిలీ బెదిరింపుల వల్ల విమాన సర్వీసులు ఆలస్యం అవ్వడం నిలిచిపోవడం జరుగుతున్నాయని తెలిపింది. ఆకతాయిలు పెట్టే ఫేక్ బెదిరింపు మెసేజ్‌లను ఎప్పటికప్పుడు గుర్తించి, తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఫేక్ బెదిరింపు మెసేజ్‌లను ఎప్పటికప్పుడు తొలగించడంలో విఫలమయ్యే సోషల్ మీడియా కంపెనీలను బాధ్యులుగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.