Battalion Police Constable's Family Members Dharna at Nagarjuna Sagar Highway(video grab)

Hyd, Oct 26:  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నాగార్జునసాగర్ హైవేపై బెటాలియన్ పోలీసు కుటుంబాలకు, పోలీసులకు స్థానిక మధ్య తోపులాట జరిగింది. మహేశ్వరం డీసీపీ ఆగ్రహం వ్యక్తం చేయడం తో ఒక్క సరిగా ఉదృతంగా మారింది బాధితుల ఆందోళన. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరహాలో మన రాష్ట్రంలోనూ ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఏక్ పోలీస్ విధానం అమలయ్యే వరకు ఫ్యామిలీ వెల్ఫేర్ సోషల్ పాటు కల్పించాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ కాలం నాటి విధి విధానాలను ప్రస్తుత కాలానికి మార్చాలని...ఓకే చోట ఐదు సంవత్సరాలు పోస్టింగ్ ఇచ్చి, ఫ్యామిలీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. శామీర్‌పేటలో షాకింగ్ రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్‌ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టి ఓ వ్యక్తి మృతి...వీడియో ఇదిగో

Here's Video:

బెటాలియన్ వ్యవస్థలో ఫటిక్ పేరుతో చేసే వెట్టి చాకిరీ నశించాలని డిమాండ్ చేశారు. హోమ్ శాఖ మీ చేతుల్లోనే ఉంది.. తమ బ్రతుకులు కూడా సీఎం చేతుల్లోనే ఉన్నాయ్ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉన్నతాధికారుల ఇండ్లలో బానిస బతుకుల నుండి విముక్తి కల్పించాలని డిమాండ్ చేయగా హోం శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి, విధి విధానాలు, జీవనశైలి ఒకే విధంగా ఉండాలని, డిమాండ్ చేస్తూ, చిన్నపిల్లల ధర్నా రాస్తారోకో చేశారు.