Wife Murdered Husband: నల్లగా ఉన్నావని భార్యను వెక్కిరించిన భర్త, గొడ్డలితో నరికి చంపిన భార్య, కసితీరా అతని మర్మాంగాలను కోసిన మహిళ, దుండగులు చంపారని కట్టుకథ
ఆమెను ‘సంగీత’ అని పిలవకుండా అభ్యంతరకర రీతిలో పిలిచేవాడని అన్నారు. దీంతో భార్యాభర్తలు పదే పదే గొడవ పడేవారని తెలిపారు. ఈ క్రమంలోనే గొడ్డలితో (AXE) నరికి భర్తను సంగీత హత్య చేసిందని, జననాంగాలను కోసేసిందని అన్నారు.
New Raipur, SEP 28: నువ్వు నల్లగా ఉన్నావు’ అంటూ ఓ వ్యక్తి తన భార్యను పదే పదే తిట్టేవాడు. ఈ మధ్య అతడి వేధింపులు మరింత పెరిగిపోయాయి. దీంతో సహనం కోల్పోయిన భార్య (Wife) తన భర్తను అతి దారుణంగా గొడ్డలితో నరికి (chops off husband) చంపేసింది. అంతేగాక, కసితీరా జననాంగాలను కోసింది. అనంతరం తన భర్తను కొందరు దుండగులు హతమర్చారంటూ నాటకాలు ఆడింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే తన భర్త వేధింపులు భరించలేక చంపేశానని అంగీకరించింది. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దుర్గ్ జిల్లాలోని అమలేశ్వర్ (Amaleswar) గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు వివరాలు తెలిపారు.
అనంత్ సాన్‌వాని (40) చాలా కాలంగా తన భార్య సంగీత సోన్వానీ(30)ని నల్లగా ఉన్నావంటూ వేధిస్తున్నాడని చెప్పారు. ఆమెను ‘సంగీత’ అని పిలవకుండా అభ్యంతరకర రీతిలో పిలిచేవాడని అన్నారు. దీంతో భార్యాభర్తలు పదే పదే గొడవ పడేవారని తెలిపారు. ఈ క్రమంలోనే గొడ్డలితో (AXE) నరికి భర్తను సంగీత హత్య చేసిందని, జననాంగాలను కోసేసిందని అన్నారు.
తన భర్తను దుండగులు హత్య చేశారని స్థానికులను నమ్మించే ప్రయత్నం చేసిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారించగా నిజానిజాలు తెలిశాయని వివరించారు. నిందితురాలిని అరెస్టు చేసి తదుపరి విచారణ జరుపుతున్నామని అన్నారు.