Unknown Pneumonia Alert: మరో కొత్త వైరస్ బాంబును పేల్చిన చైనా, అంతుచిక్కని వైరస్‌తో న్యుమోనియా సోకి కజకిస్థాన్‌లో వందలాది మంది మృత్యువాత, జాగ్రత్తగా ఉండాలని చైనీయులకు డ్రాగన్ కంట్రీ హెచ్చరిక
చైనా సరిహద్దు దేశం కజకిస్థాన్‌లో (Kazakhstan) అంతుపట్టని వ్యాధితో వందలాది మంది మృత్యువాత పడుతున్నందున జాగ్రత్తగా ఉండాలని చైనా ప్రజలను హెచ్చరించింది. గుర్తుతెలియని వైరస్ సోకి న్యుమోనియాతో (pneumonia) గత నెలలో దాదాపు 600 మంది మరణించినట్లు వెల్లడించింది. కోవిడ్-19 కంటే అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ దేశంలో నివసిస్తున్న చైనీయులను (China warns citizens) హెచ్చరించింది.
Beijing, July 10: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ (unknown pneumonia) విలమతాండవం చేస్తున్న నేపథ్యంలో తాజాగా మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. చైనా సరిహద్దు దేశం కజకిస్థాన్‌లో (Kazakhstan) అంతుపట్టని వ్యాధితో వందలాది మంది మృత్యువాత పడుతున్నందున జాగ్రత్తగా ఉండాలని చైనా ప్రజలను హెచ్చరించింది. గుర్తుతెలియని వైరస్ సోకి న్యుమోనియాతో (pneumonia) గత నెలలో దాదాపు 600 మంది మరణించినట్లు వెల్లడించింది. కోవిడ్-19 కంటే అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ దేశంలో నివసిస్తున్న చైనీయులను (China warns citizens) హెచ్చరించింది. చైనాలో మళ్లీ కొత్తగా బుబోనిక్ ప్లేగు, ఈ వైరస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? మంగోలియాపై అప్పుడే పంజా విసురుతున్న బుబోనిక్ ప్లేగు వైరస్
కజకిస్థాన్‌లో ప్రాణాంతక కరోనా వైరస్ కంటే అంతుపట్టని న్యుమోనియాతో సంభవిస్తున్న మరణాలే ఎక్కువగా ఉన్నాయి. గత ఆర్నెళ్లుగా 1772 మంది మరణించారు. ఒక్క జూన్ నెలలోనే 628 మంది మృతి చెందారు. ఇందులో చైనీయులు కూడా ఉన్నారు. ఈ దేశ వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు ఈ కొత్త వైరస్ ఆనవాలును కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంతరకు దానిని గుర్తించలేకపోయారు. అందరూ జాగ్రత్తగా ఉండండి’’అని కజకిస్థాన్‌లోని చైనా రాయబార కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వుహాన్ కరోనా చావుల మిస్టరీ, కరోనా వల్ల వుహాన్‌లో 42 వేల మందికి పైగా మృతి, 3200 మంది చనిపోయారంటూ చైనా అధికారిక ప్రకటన, RFA కథనంలో నిజమెంత ?
కాగా కజకిస్థాన్‌లో కోవిడ్-19తో అనారోగ్యం బారిన పడిన వారి కంటే.. గుర్తు తెలియని వైరస్ కారణంగా మరణించేవారే ఎక్కువగా ఉన్నారంటూ డ్రాగన్ మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. చైనా ఎంబసీ హెచ్చరికలపై కజకిస్థాన్ విదేశాంగ మంత్రిని వివరణ కోరగా వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదని పేర్కొంది. కాగా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కజకిస్థాన్‌లో మార్చి 16న లాక్‌డౌన్ విధించగా.. మే నెలలో నిబంధనల్లో భారీ సడలింపులు ఇచ్చారు. ఈ క్రమంలో మరోసారి కేసుల సంఖ్య పెరగడంతో దేశంలో సెకండ్ వేవ్ మొదలైందని కజకిస్థాన్ అధ్యక్షుడు కసీం- జొమార్ట్ తోకాయేవ్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే చైనా సరిహద్దుల్లో ఉన్న మంగోలియాలోని ఖోవ్‌డ్ ప్రావిన్స్‌లో ఇటీవల రెండు బుబోనిక్ ప్లేగ్ వ్యాధి కేసులు బయటపపడ్డాయని ఆ దేశ అధికారిక మీడియా జింగ్వా వెల్లడించింది. అడవి ఉడుత (మర్మోట్) మాంసం అమ్మే వ్యక్తి (27), అతని తమ్మునికి జూలై 1న ప్లేగ్ నిర్ధారణ అయిందని తెలిపింది. వారిద్దరూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. వారితో కాంటాక్ట్ అయిన 146 మందిని అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారని వెల్లడించింది.
బుబోనిక్ ప్లేగ్‌పై మంగోలియా అలర్ట్ అయింది. తమ దేశంలోని బయన్నూర్ పట్టణంలో గత శనివారం ఒక ప్లేగ్ కేసు నమోదైందని తెలిపిన అక్కడి ప్రభుత్వం, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని లెవల్ 3 హెచ్చరికలు జారీ చేసింది. ప్లేగ్ నియంత్రణ, నివారణకు 2020 చివరి వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని తెలిపింది. కాగా, బుబోనిక్ ప్లేగ్ వ్యాధి అడవి ఎలుకలు, ఉడుతల్లో ఉండే బ్యాక్టీరియా నుంచి వస్తుంది. ఈ బ్యాక్టీరీయా కీటకాల ద్వారా ఇతర జంతువులు, మనుషులకు వ్యాప్తిస్తుంది. ఇది ప్రాణాంతక వ్యాధి అని, సరైన వైద్యం అందకుంటే 24 గంటల్లోనే రోగి మరణించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం తెలుస్తోంది.