Beijing, July 6: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలో (China Virus) వరుసగా వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. ప్రపంచానికి కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. మొన్న కరోనా వైరస్ కల్లోలం (Coronavirus Pandemic) ఇంకా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. ఆ కల్లోలంలో ఈ మధ్య కొత్తగా G-4 అనే వైరస్ తమ దేశంలో ఉన్నట్లు చైనా పరిశోధకులు తేల్చి చెప్పారు. ఈ రెండు మరచిపోకముందే మళ్లీ బుబోనిక్ ప్లేగు (Bubonic Plague) కేసులు చైనాతో పాటు ప్రపంచానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వుహాన్ కరోనా చావుల మిస్టరీ, కరోనా వల్ల వుహాన్‌లో 42 వేల మందికి పైగా మృతి, 3200 మంది చనిపోయారంటూ చైనా అధికారిక ప్రకటన, RFA కథనంలో నిజమెంత ?
అక్కడి బయన్నూర్‌లోని ( Bayannur) ఆస్పత్రిలో శనివారం ఓ బుబోనిక్ ప్లేగు (Bubonic Plague in China) కేసు నమోదైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్లేగ్ ఇతరులకు సోకే ప్రమాదం (human-to-human infection risk possible) ఉందని డాక్టర్లు వెల్లడించారు. అతని కుటుంబ సభ్యులను ఆసుపత్రిలో చేర్చారు. వందమందికి పైగా ఈ ప్లేగ్ లక్షణాలతో (Bubonic plague case in China) బాధపడుతున్నట్లు ధృవీకరించారు. ఈ వైరస్‌ను కనుగొనేటప్పటికే దాని వ్యాప్తి ఆరంభమైందని బయన్నూర్ స్థానిక ప్రభుత్వాధికారులు అనుమానిస్తున్నారు. అందుకే ఒకేసారి వందమందికి పైగా ఈ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారని భావిస్తున్నారు. కరోనావైరస్ మానవ సృష్టే, చైనా వుహాన్ ల్యాబొరేటరీ నుంచి ఈ వైరస్ బయటకు వచ్చింది, నోబెల్ గ్రహీత మాంటగ్నియర్ ఆసక్తికర వ్యాఖ్యలు
దీన్ని దృష్టిలో ఉంచుకుని లెవల్-3 ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. స్థానికులను అప్రమత్తం చేశారు. ఈ ఏడాది చివరి వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అసాధారణ లక్షణాలు కనిపిస్తే వైద్యులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలైన జ్వరం, తలనొప్పి, చలి, వాపులు, లింప్ గ్రంధుల్లో నొప్పి, శరీరంపై పుండ్లతో బాధపడుతున్న ఓ వ్యక్తిని చైనా ఉత్తర ప్రాంతంలోని బయన్నుర్ నగర వైద్యులు గుర్తించారు. అతడి కుటుంబికులు, సన్నిహితులందరినీ గుర్తించి చికిత్స అందిస్తున్నారు. కరోనావైరస్ గుట్టు విప్పేశారు, షాకింగ్ నిజాలు వెల్లడించిన సైంటిస్టులు, దాని పుట్టుకకు రెండు కారణాలు చెబుతున్న శాస్త్రవేత్తలు
ప్లేగు మూడు రకాలు. వాటిలో ఒక రకం బుబోనిక్ ప్లేగు. ఈ ఇన్ఫెక్షన్లకు ఎర్సినియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా కారణం. ఇది ఎలుకలు, గుమ్మడి పురుగులను వాహకాలుగా వాడుకుంటుంది. అవి మనుషులను కుడితే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌ను కలుగజేస్తుంది. బయన్నూర్‌లో మర్మోట్ జాతికి చెందిన ఎలుకలను తిన్న వారే ఈ బుబోనిక్ ప్లేగ్ బారిన పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఎలుకలు తినడం చైనీయుల అలవాటు. ఇప్పుడు ఆ అలవాటే బుబోనిక్ ప్లేగ్ వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం కావచ్చనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. శ్మశానాలుగా మారుతున్న చైనా నగరాలు
చైనాకు ఉత్తర సరిహద్దులో ఉన్న మంగోలియాలోనూ (Mongolia) బుబోనిక్ ప్లేగు వేగంగా వ్యాపిస్తోంది. చైనా సరిహద్దులను ఆనుకుని ఉన్న మంగోలియాలో బుబోనిక్ ప్లేగ్ వ్యాప్తి చెందింది. మంగోలియాలోని ఖోవ్డ్ ప్రావిన్స్‌లో ఈ వ్యాధి లక్షణాలు పలువురు ఆసుపత్రులపాలైనట్లు గ్ఝిన్‌హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. 27 సంవత్సరాల వయస్సున్న ఓ వ్యక్తి, 17 సంవత్సరాల వయస్సున్న అతని సోదరుడు ఖోవ్డ్ ప్రావిన్స్‌లో ఆసుపత్రిలో చేరారు. ఆ ఇద్దరూ మర్మోట్ జాతికి చెందిన ఎలుకలను తిన్నారని తేలింది. దీనితో ఈ రకం జాతి ఎలుకలను తినకూడదంటూ స్థానిక అధికారులు ఆదేశాలను జారీ చేశారు. దీన్ని నివారించడానికి అధికారులు లెవెల్-3 ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.