Bail Granted to Jani Master: జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు, గత రెండు వారాలుగా చంచల్ గూడ జైలులో ఉన్న కొరియోగ్రాఫర్

ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. తనపై జానీ మాస్టర్‌ లైంగికదాడి చేసినట్లు మహిళా కొరియోగ్రాఫర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Jani Master (Credits: X)

మహిళా డ్యాన్సర్‌పై లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్నకొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు (Jani Master) తెలంగాణ హైకోర్టు ఊరట ఇచ్చింది. ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. తనపై జానీ మాస్టర్‌ లైంగికదాడి చేసినట్లు మహిళా కొరియోగ్రాఫర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెప్టెంబర్‌ 16న ఆయనపై నార్సింగి పోలీసులు 376,506,323 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. కోర్టు ఆయకు రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలులో ఉంటున్నారు.

బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి.. నేడే విచారణ.. ఏమవుతుందో??

జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేపథ్యంలో ఈ నెల 6 నుంచి 9 వరకు ఆయనకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గడువు ముగియడంతో ఆయన మళ్లీ జైలుకు వెళ్లారు. కాగా, రెగ్యులర్‌ బెయిల్‌ కోసం పోక్సో కోర్టులో దాఖలు చేసిన పిటిషనన్‌ను ఈ నెల 14న కోర్టు తిరస్కరించింది. తాజాగా ఆయనకు న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. దీంతో ఆయన గురువారం సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నది.

ముంబైలోని ఓ హోటల్‌లో తనపై లైంగికదాడికి పాల్పడినట్టు మహిళా డ్యాన్సర్ తెలిపింది. నార్సింగి పోలీసులు జానీమాస్టర్‌పై 376,506,323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని పోలీసులు ఇంట్లోనే విచారించారు. అనంతరం ఆమె నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని మరిన్ని వివరాలను తెలిపింది. మతం మార్చుకుని వివాహం చేసుకోవాలని వేధిస్తున్నాడని చెప్పింది. ఒప్పుకోకుంటే అవకాశాలు రాకుండా అడ్డుకుంటానని బెదిరించినట్టు తెలిపింది.