Nirbhaya Case: నిర్భయ కేసులో తన మరణశిక్షను సమీక్షించాలంటూ దోషి పెట్టుకున్న రివ్యూ పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న చీఫ్ జస్టిస్ ఎస్.ఎ బొబ్డే, విచారణ రేపటికి వాయిదా
సత్యయుగంలో ప్రజలు వెయ్యేండ్ల పాట్లు జీవించేవారు, నేటి కాలంలో మనుషుల జీవితం చాలా చిన్నది అంటూ వేదాలు వల్లించాడు....
New Delhi, December 17: నిర్భయ గ్యాంగ్‌రేప్, హత్య కేసు (Nirbhaya Case) లో నలుగురు దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ (Akshay Singh) పెట్టుకున్న రివ్యూ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారానికి వాయిదా వేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ బొబ్డే (SA Bobde) ఈ రివ్యూ పిటిషన్ విచారణ నుంచి తప్పుకోవడంతో ఈరోజు జరగాల్సిన విచారణ రేపు ఉదయం 10:30 గంటలకు జరగనుంది. ఈ పిటిషన్‌ను విచారించడానికి ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని సిజెఐ బొబ్డే నియమిస్తున్నారు.
నిర్భయ కేసులో తనకు పడిన మరణశిక్షను సవాలు చేస్తూ అక్షయ్ సింగ్ డిసెంబర్ 10న సుప్రీంకోర్టులో సమీక్ష పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో తను తప్పుగా దోషిగా నిర్ధారించారని చెబుతూ, ఈ తరహా కేసుల్లో పలు దేశాల్లో ఉరిశిక్షలను రద్దు చేసిన విషయాలను, న్యాయ సంబంధిత అంశాలను తన పిటిషన్ లో పేర్కొన్నాడు.
ANI Tweet:
దిల్లీలో గాలి, తాగేనీరు కాలుష్యం కారణంగా ఇప్పుడు ఉన్న జీవితం హరించుకుపోతున్నది, అలాంటపుడు ఉరిశిక్షలో అర్థమేముంది. సత్యయుగంలో ప్రజలు వెయ్యేండ్ల పాట్లు జీవించేవారు, నేటి కాలంలో మనుషుల జీవితం చాలా చిన్నది అంటూ వేదాలు వల్లించాడు. 2002వ సంవత్సరం డిసెంబర్ 16న రాత్రి దేశ రాజధాని దిల్లీ 23 ఏళ్ల నిర్భయపై జరిగిన ఘటనకు ఏడేళ్లు
నలుగురు దోషుల్లో అక్షయ్ సింగ్ మాత్రమే జాలి చూపండంటూ పిటిషన్ (Mercy Petition) పెట్టుకున్నాడు, మిగతా వారి రివ్యూ పిటిషన్లను గతంలోనే సుప్రీంకోర్టు కొట్టివేసింది. వీరంతా దిల్లీలోని తీహార్ కారాగారంలోని 3వ నెంబరు జైలులో వేరువేరు సెల్స్ లలో ఉంచబడ్డారు. వీరిని వీరి తల్లిదండ్రులు ప్రతీ 14 రోజులకు ఒకసారి కలిసేందుకు అనుమతి ఉంది.