Colombian Police Viral Video: కుక్క నోట్లో నోరు పెట్టి ఊపిరి ఊదిన పోలీస్, వరదల్లో చిక్కుకున్న కుక్కను కాపాడిన ఖాకీలు, వైరల్ వీడియో..

ఈ వీడియోలో, కుక్కను రక్షించడానికి కొంతమంది పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేగంగా ప్రవహించే నీటిలో కొట్టుకుపోతున్న ఓ కుక్కను కాపాడారు.

(Photo Credit: social media)

కొంతమంది జంతువుల జీవితాలను తేలికగా తీసుకుంటారు. అమాయక జంతువులను రకరకాలుగా వేధిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చాలాసార్లు తెరపైకి వస్తున్నాయి. అయితే తాజాగా ఓ మూగజీవిని కాపాడేందుకు కొలంబియా పోలీసులు చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, కుక్కను రక్షించడానికి కొంతమంది పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేగంగా ప్రవహించే నీటిలో కొట్టుకుపోతున్న ఓ కుక్కను కాపాడారు. అంతే కాదు ఈ కుక్క నీరు ఎక్కువగా మింగడంతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది. దీంతో ఓ పోలీసు ఏకంగా మానవత్వంతో ఆ కుక్కకు సీపీఆర్ పద్ధతిలో నోటి ద్వారా శ్వాస ఇచ్చి మరీ కాపాడారు.

ఈ వైరల్ వీడియోను లక్ష మందికి పైగా చూశారు. ఈ వీడియోలో పోలీసు సిబ్బంది ధైర్యాన్ని చూసిన సోషల్ మీడియా యూజర్లు తెగ పొగిడారు. ఈ వీడియో @TheFigen ఖాతా నుండి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది.



సంబంధిత వార్తలు