Kerala High Court: భార్యను మరొకరితో పోల్చడం వేధింపుల కిందకే వస్తుంది, విడాకుల కేసులో కేరళ హైకోర్టు సంచలన తీర్పు, భార్యను ఇతరులతో పోలిస్తే మానసింకా హింసించినట్లే అన్న ధర్మాసనం
ఓ విడాకుల కేసును విచారించిన కేరళ హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను (Wife) మరో మహిళతో పోల్చడం మానసిక వేధింపుల కిందికి వస్తుందని పేర్కొంది.
Kerala, AUG 18: భార్యభర్తల విడాకుల కేసుకు (Divorce Case) సంబంధించి కేరళ హైకోర్టు (Kerala High Court) ఇచ్చిన తీర్పు...సంచలనంగా మారింది. భార్యను ఇతరులతో పోల్చడం నిత్యం హింసించడం కిందకే వస్తుందని, మానసిక వేధింపులేనని కోర్టు స్పష్టం చేసింది. ఓ విడాకుల కేసును విచారించిన కేరళ హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను (Wife) మరో మహిళతో పోల్చడం మానసిక వేధింపుల కిందికి వస్తుందని పేర్కొంది. భార్య తన అంచనాలకు తగ్గట్లు లేదని భర్త నిత్యం హింసిస్తే అది మానసిక వేధింపులేనని స్పష్టం చేసింది. 2019లో వివాహమైన వ్యక్తి తన భార్యతో విభేదాల కారణంగా విడాకులు కోరుతూ డైవోర్స్ పిటిషన్ (Divorce Case)దాఖలు చేశాడు. తాను అందంగా లేనంటూ భర్త నిత్యం వేధిస్తుండటంతో తాను కుంగుబాటుకు లోనయ్యానని, మానసిక క్షోభకు గురయ్యానని మహిళ కోర్టుకు తెలిపింది.
భార్యను ఇతర మహిళతో పోలుస్తూ వ్యాఖ్యలు చేయడం మానసిక వేధింపుల కిందికి వస్తాయని కేసును విచారించిన జస్టిస్ అనిల్ కే నరేంద్రన్ (Justice Anil K Narendran), జస్టిస్ సీఎస్ సుధతో (CS Sudha) కూడిన హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. కేసు విచారణలో భాగంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
మ్యారేజ్ కౌన్సిలర్‌ను సంప్రదించి విడిపోయిన జంట తిరిగి కలుసుకునేందుకు ప్రయత్నించాలని కోర్టు కోరింది. భార్య, భర్త విడిపోయి చాలాకాలం పాటు వేర్వేరుగా ఉంటూ వారిలో ఎవరో ఒకరు విడాకులకు కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు వైవాహిక బంధం విచ్ఛిన్నమైందని చెప్పవచ్చని కోర్టు పేర్కొంది.