Vaccines Price Reduce: భారీగా తగ్గనున్న వ్యాక్సిన్ల ధరలు, కేంద్రం నిర్ణయంతో దిగివస్తున్న రేట్లు, కోవాగ్జిన్ రూ.275 ఇచ్చే యోచన

రోనా వ్యాక్సిన్ల రేట్లు భారీగా తగ్గనున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కోవిషీల్డ్‌, కోవాగ్జిన్ ధ‌ర‌లు దిగిరానున్నాయి. క‌రోనా వైరస్ వ్యాధి నిరోధ‌క కోవిడ్ వ్యాక్సిన్‌లను సరసమైన ధరల‌కు అందించాల‌ని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. దీంతో కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలు ఒక్కో డోస్‌కి రూ.275 మేర ప‌రిమితం చేసే అవకాశ‌మున్నద‌ని ప్రభుత్వ వ‌ర్గాలు తెలిపాయి.

COVID-19 Vaccine (Photo Credits: PTI)

New Delhi, January 26: కరోనా వ్యాక్సిన్ల రేట్లు(Vaccines Price) భారీగా తగ్గనున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కోవిషీల్డ్‌ (Covishield), కోవాగ్జిన్ (Covaxin) ధ‌ర‌లు దిగిరానున్నాయి. క‌రోనా వైరస్ వ్యాధి నిరోధ‌క కోవిడ్ వ్యాక్సిన్‌లను సరసమైన ధరల‌కు అందించాల‌ని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. దీంతో కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలు ఒక్కో డోస్‌కి రూ.275 మేర ప‌రిమితం చేసే అవకాశ‌మున్నద‌ని ప్రభుత్వ వ‌ర్గాలు తెలిపాయి. అయితే సర్వీస్ ఛార్జీ (additional service charge) రూ.150 అద‌నంగా ఉంటుంద‌ని వెల్లడించాయి. డ్రగ్ రెగ్యులేటర్ (Drug Regulator) నుండి సాధారణ మార్కెట్ ఆమోదం కోసం ఈ రెండు వ్యాక్సిన్ త‌య‌రీ సంస్థలు వేచి ఉన్నాయ‌ని ప్రభుత్వ వ‌ర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్ ధరల‌ను పరిమితం చేసే పనిని ప్రారంభించాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ  (National Pharmaceutical Pricing Authority ) ఇప్పటికే ఆదేశించిన‌ట్లు చెప్పాయి.

ప్రస్తుతం భారత్ బయోటెక్(Bharath biotech) ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్(Covaxin) ప్రతి డోస్ ధర రూ. 1,200 కాగా, సీరం ఇన్‌స్టిట్యూట్ కోవిషీల్డ్(Covisheid) ధ‌ర ప్రైవేటు సంస్థల‌కు రూ.780గా ఉన్నది. రూ. 150 సర్వీస్ ఛార్జీ కూడా ఈ ధ‌ర‌లోనే క‌లిపి ఉంది. అయితే కొన్ని షరతులకు లోబడి వయోజన జనాభాలో ఉపయోగించడానికి కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు రెగ్యులర్ మార్కెట్ ఆమోదం ఇవ్వాలని ఈ రెండు ఫార్మా సంస్థలు ద‌ర‌ఖాస్తు చేశాయి. మ‌రోవైపు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (Central Drugs Standards Control Origination) కోవిడ్ -19 సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ కూడా ఈ నెల 19న దీనికి సిఫార్సు చేసింది.

Research on Omicron: దడ పుట్టిస్తున్న జపాన్ సైంటిస్టుల రీసెర్చ్, ప్లాస్టిక్ పై ఒమిక్రాన్ ఎన్నిరోజులుంటుందో తెలుసా? మనిషి శరీరంపై 21 గంటల పాటూ సజీవంగా ఒమిక్రాన్

ఈ ప‌రిణామం నేప‌థ్యంలో వ్యాక్సిన్‌ల ధరను త‌గ్గించేందుకు ఎన్పీపీఏ ప్రయ‌త్నిస్తున్నద‌ని ప్రభుత్వ వ‌ర్గాలు తెలిపాయి. దీంతో ఒక్కో డోసుకు రూ. 150 అదనపు సర్వీస్ ఛార్జీతో పాటు టీకా ధర రూ. 275కి పరిమితం చేసే అవకాశం ఉన్నద‌ని వెల్లడించాయి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Donald Trump 2.0: గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చిన డొనాల్డ్ ట్రంప్,అంతర్జాతీయ భద్రత కోసం గ్రీన్‌ల్యాండ్‌ కొనుగోలుకు సరికొత్త వ్యూహం

Donald Trump on BRICS Nations: బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్, అమెరికా డాలర్‌కు నష్టం కలిగించే ఏ దేశానికైనా 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరిక

Trump Says Putin 'Destroying Russia': సంధి కుదుర్చుకోకుండా రష్యాను పుతిన్ నాశనం చేస్తున్నాడు, తొలి రోజే మిత్రుడికి షాకిచ్చిన అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్

Donald Trump 2.0: అమెరికాలో పుట్టిన విదేశీ పిల్లలకు యూఎస్ పౌరసత్వం రద్దు, లక్షలాది మంది భారతీయుల మెడపై వేలాడుతున్న బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ కత్తి, అసలైంటి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ?

Share Now