Corona New Symptom: బయటపడ్డ కరోనా కొత్త లక్షణం, మీకు ఈ సమస్య ఉంటే కరోనా అయిఉండొచ్చు, వెంటనే చెక్ చేసుకోండి!

ప్రస్తుతం ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు వైరస్‌ యొక్క కొత్త లక్షణాలను కనుగొన్నారు. అదే ‘మైయాల్జియా (myalgia)’. గత లక్షణాలతో పోలిస్తే ‘మైయాల్జియా (myalgia)’ పూర్తి భిన్నంగా ఉన్నట్లు జో కొవిడ్‌ స్టడీ యాప్‌ నివేదిక ద్వారా వెల్లడైంది.

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, JAN 05: కరోనా వైరస్‌.. మూడేళ్లుగా (COVID-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. మధ్యలో కాస్త శాంతించినట్లు కనిపించిన ఈ మహమ్మారి కొత్త వేరియంట్లతో ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అయితే కొవిడ్‌ను గుర్తించేందుకు ఇప్పటి వరకు కొన్ని సాధారణ లక్షణాలు ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఆల్ఫా, డెల్టా (delta Variant) వేరియంట్లలో ముక్కు కారడం, రుచి, వాసన కోల్పోవడం, విపరీతమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం, గొంతునొప్పి ప్రధాన లక్షణాలుగా పరిగణించారు. కాగా, ప్రస్తుతం శీతాకాలం కావడంతో మరోసారి వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు వైరస్‌ యొక్క కొత్త లక్షణాలను కనుగొన్నారు. అదే ‘మైయాల్జియా (myalgia)’. గత లక్షణాలతో పోలిస్తే ‘మైయాల్జియా (myalgia)’ పూర్తి భిన్నంగా ఉన్నట్లు జో కొవిడ్‌ స్టడీ యాప్‌ నివేదిక ద్వారా వెల్లడైంది. కండరాలలో నొప్పి ప్రారంభమవడమే వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌కు ప్రధాన సంకేతం. కొవిడ్‌ సోకిన వారిలో కండరాల నొప్పి కనీసం మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఇబ్బంది పెడుతుంది. వీటితోపాటు ఇతర కొవిడ్‌ లక్షణాలు కూడా కనిపిస్తాయి.

Man Dies Of Heart Attack in Gym: జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తి గుండెపోటుతో కుప్పకూలిన ఓ వ్యక్తి, సీసీ టీవీ పుటేజీ వైరల్ 

కండరాలలో, ముఖ్యంగా కీళ్లలో విపరీతమైన నొప్పి రావడాన్నే ‘మైయాల్జియా’ (MYALGIA ) అంటారు. మీ శరీరంలోని రోగనిరోధక శక్తి ఇన్‌ఫెక్షన్‌తో ఎంతవరకు పోరాడుతుందనే దానిపై నొప్పి ఆధారపడి ఉంటుంది. ఇన్‌ఫెక్షన్‌ సోకినవారు తరచుగా భుజాల నొప్పి, కాళ్ళ నొప్పితో ఇబ్బంది పడతారు. దీన్నే ‘కొవిడ్‌ సంబంధిత కండరాల నొప్పి’ (COVID-related muscle pain) అని కూడా పిలుస్తారు. ఇది మనిషి కదలికలపై తీవ్ర ప్రభావం చూపుతూ అసౌకర్యానికి గురిచేస్తుంది. ‘మైయాల్జియా’ అనేది దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక నొప్పితో రావచ్చు అని నివేదికలు చెబుతున్నాయి. మీరు పనిచేస్తున్నప్పుడే కాదు.. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా ఈ నొప్పి మిమ్మల్ని బాధించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.



సంబంధిత వార్తలు