COVID-19 Vaccine Price: కోవిషీల్డ్ టీకా కావాలంటే రూ. 600 చెల్లించాల్సిందే, కోవిషీల్డ్ టీకా ధరలను ప్రకటించిన సీరం, నాలుగైదు నెలల్లో రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులోకి..
ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో టీకా కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉత్పత్తి దారులు 50శాతం డోసులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు, బహిరంగా మార్కెట్‌లో అమ్ముకునేందుకు వీలు కల్పించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తాజాగా ప్రైవేటు మార్కెట్లో కోవిషీల్డ్ టీకా ధరలను (COVID-19 Vaccine Price) సీరమ్ సంస్థ బుధవారం ప్రకటించింది.
New Delhi, April 21: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో టీకా కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉత్పత్తి దారులు 50శాతం డోసులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు, బహిరంగా మార్కెట్‌లో అమ్ముకునేందుకు వీలు కల్పించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తాజాగా ప్రైవేటు మార్కెట్లో కోవిషీల్డ్ టీకా ధరలను (COVID-19 Vaccine Price) సీరమ్ సంస్థ బుధవారం ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ఒక్కో డోస్ ధర 400 రూపాయలు (States to Get Covishield at Rs 400 Per Dose), ప్రైవేట్ ఆస్పత్రులకు ఇచ్చే ఒక్కో డోస్ ధర రూ.600గా (Private Hospitals at Rs 600) సీరం నిర్ణయించింది. నాలుగైదు నెలల్లో రిటైల్ స్టోర్లలోనూ విక్రయించనున్నట్లు వెల్లడించింది. కేంద్రానికి కోవిషీల్డ్ ఒక్కో డోసును 150 రూపాయలకు సీరమ్ సంస్థ అందిస్తోంది. కాగా వచ్చే రెండు నెలల్లో టీకా ఉత్పత్తిని మరింత పెంచి కొరతను అధిగమిస్తామని సీరమ్ సంస్థ (Serum Institute of India) పేర్కొంది. 4, 5 నెలల తర్వాత రిటైల్ మార్కెట్‌లోనూ అందుబాటులోకి తచ్చెందుకు ప్రయత్నిస్టున్నట్లు వెల్లడించింది.
కోవాగ్జిన్ ఒక్కో డోసు రూ.206కి భారత్ బయోటెక్ ఇస్తోంది. కోవిషీల్డ్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలపై ఒక్కో డోసుకు రూ.250 భారం పడుతుంది. కాగా ఫైజర్ వ్యాక్సిన్ ఒక్కో డోసు రూ.1431, మోడర్నా వ్యాక్సిన్ రూ.2348-2715, సినోవాక్ వ్యాక్సిన్ ఒక్కో డోసు రూ.1027, జాన్సన్ అండ్ జాన్సన్ రూ.734గా ఉంది. రాబోయే రెండు నెలల్లో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచుతామని పేర్కొంది.
Here's Update
ఉత్పత్తి సామర్థ్యంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని, మిగిలిన 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఇస్తామని తెలిపింది. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు, వ్యాక్సినేషన్ సెంటర్లు నేరుగా వ్యాక్సిన్‌ను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు దోహదపడతాయని తెలిపింది. రిటెయిల్ వ్యాపారంలో ప్రత్యేకంగా కార్పొరేట్ సంస్థలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేయడం సవాలుతో కూడుకున్నదని వివరించింది.
ఇక దేశీయంగా అభివృద్ధిపరిచిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌పై కోవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తోందని, సార్స్-కోవ్-2కు చెందిన వేర్వేరు రూపాలను నిర్వీర్యం చేస్తోందని తెలిపింది. కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి మన దేశంలో కోవిడ్-19 చికిత్సలో అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరొక 60 దేశాల్లో కోవాగ్జిన్ వినియోగానికి అనుమతుల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది.
ఐసీఎంఆర్ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఎస్ఏఆర్ఎస్-సీఓవీ-2 (సార్స్-కోవ్-2)కు చెందిన వివిధ రూపాలను కోవాగ్జిన్ ధ్వంసం చేసినట్లు ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌ను కూడా సమర్థవంతంగా నాశనం చేసినట్లు వెల్లడైంది. యూకే వేరియెంట్, బ్రెజిల్ వేరియెంట్‌లపై కోవాగ్జిన్ సామర్థ్యాన్ని ఐసీఎంఆర్-ఎన్ఐవీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ) వివరించాయి. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్ బి.1.617 సార్స్-కోవ్-2ను మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గుర్తించినట్లు తెలిపాయి. దీనిని వేరుపరచి, వర్గీకరించడంలో విజయం సాధించినట్లు తెలిపాయి. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌ను నాశనం చేయడంలో కూడా కోవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తోందని గుర్తించినట్లు వివరించాయి.