Rajasthan Crime: పోలీసుల కళ్లలో కారం చల్లి గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపిన ప్రత్యర్థులు, ప్రతీకార హత్యగా ప్రకటించిన రాజస్థాన్ పోలీసులు

పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ (Gangstar) కుల్దీప్ జఘిన (Kuldeep Jaghina)ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బుధవారంనాడు కాల్చిచంపారు.

Alabama Shooting

రాజస్థాన్‌ (Rajasthan)లో గ్యాంగ్‌వార్ చోటుచేసుకుంది. పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ (Gangstar) కుల్దీప్ జఘిన (Kuldeep Jaghina)ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బుధవారంనాడు కాల్చిచంపారు. పోలీసుల కళ్లలో కారం కొట్టి.. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపింది ప్రత్యర్థి గ్యాంగ్‌.పోలీసులు దీనిని ప్రతీకార హత్యగానే ప్రకటించారు.

కుల్దీప్‌ అనే గ్యాంగ్‌ స్టర్‌ బీజేపీ నేత కృపాల్‌ జఘిన హత్య కేసులో ప్రధాన నిందితుడు. సెప్టెంబర్‌ 4, 2022లో ఈ హత్య జరగ్గా.. ఆ మరుసటిరోజే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కుల్దీప్‌ను అరెస్ట్‌ చేశారు. అయితే.. పోలీసుల కస్టడీలో ఉన్న కుల్దీప్‌, సహనిందితుడు విజయ్‌పాల్‌ను ఇవాళ జైపూర్‌ జైలు నుంచి భరత్‌పూర్‌ కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకెళ్తున్నారు.

ఒడిశా రైలు ప్రమాదం కేసు, ఏడుగురు రైల్వే ఉద్యోగులు సస్పెండ్, సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు

ఈ క్రమంలోనే ఓ వాహనంలో దూసుకొచ్చిన ప్రత్యర్థులు పోలీసుల కళ్లలో కారం కొట్టి.. కుల్దీప్‌ను కాల్చి చంపారు. మొత్తం పదిహేను రౌండ్ల కాల్పులు జరిపారు. కుల్దీప్‌ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. విజయ్‌పాల్‌ గాయపడగా.. అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. జైపూర్‌-ఆగ్రా నేషనల్‌ హైవేపై అమోలీ టోల్‌ ప్లాజా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిపాక నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.

ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసుల బృందం.. సమీపంలోని గ్రామం నుంచి దుండగుల వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ ఆగ్రా జాతీయ రహదారిపై ఉన్న అమోలీ టోల్ ప్లాజా సమీపంలో ఈ ఘటన జరిగిందని, తదుపరి విచారణ జరుపుతున్నామని రాజస్థాన్ డీజీపీ ఉమేష్ మిశ్రా తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif