Cyclone Tauktae: కరోనాకు తోడవుతున్న తీవ్ర తుఫాన్, అరేబియా సముద్రంలో పుట్టిన తౌక్టే, పశ్చిమ తీరాన్ని వణికించేందుకు రెడీ, ఈ నెల 16 నాటికి తుపాను తీవ్ర రూపం దాల్చుతుందని తెలిపిన ఐఎండీ

ఒకవేళ అదే నిజమైతే, ఈ ఏడాది ఏర్పడే తొలి తుపాను అదేనని పేర్కొంది. దీనికి మయన్మార్ సూచించిన ‘తౌక్టే తుఫాను’ (Cyclone Tauktae) అని పేరు పెట్టనున్నారు.

Cyclone-Rain-forecast- (Photo-Twitter)

New Delhi, May 12: అరేబియా సముద్రంలో రాబోయే కొన్ని రోజుల్లోనే భీకర తుపాను ఏర్పడబోతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఒకవేళ అదే నిజమైతే, ఈ ఏడాది ఏర్పడే తొలి తుపాను అదేనని పేర్కొంది. దీనికి మయన్మార్ సూచించిన ‘తౌక్టే తుఫాను’ (Cyclone Tauktae) అని పేరు పెట్టనున్నారు. మయన్మార్ భాషలో తౌక్టే ( Cyclonic Storm Tauktae) అనగా బల్లి లేదా ఆ జాతికి చెందిన జీవి అర్థం వస్తుంది. ఈ తుపాను ప్రభావం దేశ పశ్చిమ తీరంలో ఎక్కువగా ఉంటుందని ఐఎండీ (IMD)పేర్కొంది.

ఈ నెల 16 నాటికి తుపాను వస్తుందని, ఈ నెల 15–16 తేదీల మధ్య లక్షద్వీప్ లోని లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతాయని హెచ్చరించింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో (Cyclonic Storm Over East Central Arabian Sea) 14 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొంది. 15న లక్షద్వీప్ కు చేరుకుని 16న తుపానుగా మరింత తీవ్ర రూపం దాలుస్తుందని తెలిపింది. మళ్లీ అది వాయవ్య దిశగా ప్రయాణిస్తూ మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది.

భారత్‌లో కేసులు, మరణాల పెరుగుదలకు ఈ వైరస్సే కారణం 44 దేశాలను వణికిస్తున్న భారత్ బీ.1.617 వేరియంట్‌, వేగంగా వ్యాప్తిస్తూ ప్రమాదకరంగా మారిన కొత్త రకం కరోనా

Here's Cyclone Tauktae Update

లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో తుపాను ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. 17 లేదా 18న తుపాను గమనం మారి కచ్, దక్షిణ పాకిస్థాన్ దిశగా ప్రయాణించే అవకాశం ఉందని, అప్పుడు గుజరాత్ తీరంపైనా దాని ప్రభావం ఉంటుందని తెలిపింది. మరో రెండు, మూడ్రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని తెలిపింది.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..