Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో రెడ్ జోన్‌ను తాకిన వాయు కాలుష్యం, పట్టపగలు కూడా ఇళ్లలోంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిక, వీడియోలు ఇవిగో..

ఢిల్లీలో కాలుష్యం (Air Pollution) రెడ్ జోన్‌ను తాకింది.దీపావళి వేడుకల తర్వాత వాయు కాలుష్య స్థాయిలు పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీ అంతటా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. అనేక ప్రాంతాల్లో AQI 400 మార్కును దాటింది.

Dense Smog Covers India Gate (Photo Credits: X/ @ANI)

ఢిల్లీలో కాలుష్యం (Air Pollution) రెడ్ జోన్‌ను తాకింది.దీపావళి వేడుకల తర్వాత వాయు కాలుష్య స్థాయిలు పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీ అంతటా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. అనేక ప్రాంతాల్లో AQI 400 మార్కును దాటింది. అక్టోబర్ 21న సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం.. ఇండియా గేట్ వద్ద AQI 342 వద్ద ఉంది, ఇది "తీవ్రమైన" ఆందోళన అంశంగా మారింది. అలాగే RK పురం, అక్షరధామ్‌లోని INA, AIIMS సమీపంలోని ప్రాంతాలు వరుసగా 368, 358తో చాలా అధ్వాన్న స్థాయికి చేరాయి.

ఇక షాలిమార్ బాగ్, జహంగీర్‌పురిలో 407, 408 AQI స్థాయిలు నమోదయ్యాయి, ఇది ప్రమాదకరమైన గాలి నాణ్యతను సూచిస్తుంది. ANI షేర్ చేసిన వీడియోలు నగరంలోని ప్రధాన ప్రాంతాలను కప్పి ఉంచే దట్టమైన పొగమంచును చూపిస్తున్నాయి, దీని వలన అధికారులు GRAP-2 చర్యలను తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. వాయుకాలుష్యం పెరగడంతో ప్రజలకు కళ్లు, ముక్కు, గొంతులో మంట, దురద సమస్యలు తలెత్తుతున్నాయి. మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం, బాణాసంచా అమ్మ‌కాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్, అక్టోబ‌ర్ 18 నుంచి 21వ తేదీ వ‌ర‌కు గ్రీన్ క్రాక‌ర్స్ అమ్మ‌కాల‌కు అనుమ‌తి

పట్టపగలు కూడా ఇళ్లలోంచి ఎవరూ బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచించారు. రేపటి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు ప్రాంతాల్లో AQI 400 దాటింది. పలు ప్రాంతాలను రెడ్‌జోన్‌గా అధికారులు ప్రకటించారు. 38 ఎయిర్‌ మానిటరింగ్‌స్టేషన్లలో 36 రెడ్‌జోన్‌లోనే ఉన్నాయి. వజీర్‌పూర్‌ 423, ద్వారకా 417, అశోక్‌ విహార్‌ 404, ఆనంద్‌ విహార్‌లో 404గా AQI నమోదైంది.

Dense Smog Engulfs National Capital As AQI Crosses 400 Post-Diwali Celebrations

2025 అక్టోబర్ 15న సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి మాత్రమే అనుమతి ఇచ్చిన సంగతి విదితమే. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టు ఢిల్లీ ప్రజలు పట్టించుకోలేదు. దీంతో కాలుష్య తీవ్రత మరింత పెరిగింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్

Sperm Quality Linked to Living Longer: వీర్య కణాల నాణ్యత ఎక్కువగా ఉన్న వారికి గుడ్ న్యూస్, తక్కువ ఉన్నవారి కంటే వాళ్లు మూడేళ్లు ఎక్కువగా జీవిస్తారని చెబుతున్న అధ్యయనాలు

Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..

Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళా నదీ జలాల్లో స్థాయికి మించి మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్‌ బ్యాక్టీరియా, స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGTకి నివేదిక ఇచ్చిన CPCB

Advertisement
Advertisement
Share Now
Advertisement