IRS Officer Commits Suicide: కరోనా భయంతో ఐఆర్ఎస్ అధికారి ఆత్మహత్య, ఢిల్లీలో విషాద ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు

కరోనావైరస్ సోకిందన్న భయంతో ఓ ఐఆర్ఎస్ అధికారి తన కారులోనే యాసిడ్ తాగి ఆత్మహత్యకు (IRS Officer Commits Suicide) పాల్పడ్డారు. తన వల్ల తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదనే ఈ తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆయన రాసిన సూసైడ్ నోట్‌‌ను ( suicide Note) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్వారక ఏరియాలో (Delhi's Dwarka area) కారులో ఓ వ్యక్తి స్పృహ లేకుండా పడి వున్నారన్న సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్టు ధ్రువీకరించారు.

representational image (photo-Getty)

New Delhi, June 15: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణం జరిగింది. కరోనావైరస్ సోకిందన్న భయంతో ఓ ఐఆర్ఎస్ అధికారి తన కారులోనే యాసిడ్ తాగి ఆత్మహత్యకు (IRS Officer Commits Suicide) పాల్పడ్డారు. తన వల్ల తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదనే ఈ తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆయన రాసిన సూసైడ్ నోట్‌‌ను ( suicide Note) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్వారక ఏరియాలో (Delhi's Dwarka area) కారులో ఓ వ్యక్తి స్పృహ లేకుండా పడి వున్నారన్న సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్టు ధ్రువీకరించారు. గత 24 గంటల్లో 325 మంది మృతి, దేశ వ్యాప్తంగా 3,32,424కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, నవంబర్‌ రెండో వారం నాటికి గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందన్న ఐసీఎంఆర్‌

బాధితుడిని ఢిల్లీకి చెందిన 56 ఏళ్ల ఐఆర్ఎస్ అధికారిగా పోలీసులు గుర్తించారు. కాగా, ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ అని రావడం గమనార్హం. కరోనా సోకిందన్న భయంతోనే (fear of spreading Covid-19) తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన వల్ల తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆత్మహత్యకు ముందు ఆయన రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కేసు దర్యాప్తు చేస్తున్నామని, పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబానికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. కాగా 2006 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి శివరాజ్ సింగ్ ఢిల్లీ ఆర్‌కె పురంలో ఆదాయపు పన్ను కమిషనర్‌గా (సీఐటిగా) పనిచేస్తున్నారు.