Delhi Floods: దేశ రాజధానిని వణికిస్తున్న యమునా నది ఉగ్రరూపం, ఢిల్లీలో రెండు రోజుల పాటు మంచినీళ్లు బంద్, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే హర్యానాలోని హత్నికుండా బ్యారేజీ నుంచి నీటిని విడుదల కొనసాగుతుండటంతో యమున నది గరిష్ట నీటి మట్టంతో ఉధృతంగా ప్రవహిస్తోంది.

rickshaw-puller pedals through chest-deep water in the flooded area near Red Fort of Delhi

New Delhi, July 13: ఢిల్లీలో గత మూడు రోజులుగా ఎగువ నుంచి వస్తున్న వరదతో యమునా నది ఉప్పొగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే హర్యానాలోని హత్నికుండా బ్యారేజీ నుంచి నీటిని విడుదల కొనసాగుతుండటంతో యమున నది గరిష్ట నీటి మట్టంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. 45 ఏళ్ల రికార్డును తుడిచిపెడుతూ 208.66 మీటర్ల గరిష్ట నీటి మట్టంతో ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్లు ఎగువన ప్రవహిస్తోంది. అయితే గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

యమునా నది నీటిమట్టం పెరగడంతో వజీరాబాద్, చంద్రవాల్, ఓఖ్లాలోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను మూసివేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. దీని వల్ల ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తుతుంది. నది నీటిమట్టం తగ్గిన వెంంటనే ఈ ప్లాంట్‌లను మళ్లీ రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. దీని కార‌ణంగా ఢిల్లీలో సుమారు 25 శాతం నీటి స‌ర‌ఫ‌రా త‌గ్గిపోతుంద‌ని ఆయ‌న తెలిపారు. అదే విధంగా ఈ క్రమంలో హత్నికుండా బ్యారేజ్ నుంచి నీటి విడుదల నిలిపివేయాలని కేంద్రాన్ని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. అయితే పూర్తిస్థాయి నీటి మట్టం దాటేయడంతో, అదనపు నీటిని విడుదల చేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది.

ఛాతిలోతు నీళ్లలో రిక్షా తొక్కుకుంటూ వెళుతున్న రికావోడు, ఢిల్లీలో వరద బీభత్సం తెలిపే వీడియోలు ఇవిగో..

బోర్ల‌ను కూడా మూసివేసిన‌ట్లు సీఎం చెప్పారు. ఒక‌టి లేదా రెండు రోజుల పాటు ఢిల్లీలో నీటి కొర‌త ఏర్ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. శుక్ర‌వారం సాయంత్రం త‌ర్వాత మ‌ళ్లీ నీటి స‌ర‌ఫ‌రా పున‌రుద్ద‌ర‌ణ జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు సీఎం కేజ్రీ వెల్ల‌డించారు. కేంద్ర జ‌ల సంఘం ప్ర‌కారం ఇవాళ సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు య‌మునా న‌ది ప్ర‌వాహం హెచ్చ స్థాయికి చేరుకుంటుంద‌ని, ఆ త‌ర్వాత నీటి మ‌ట్టం త‌గ్గ‌డం ప్రారంభం అవుతుంద‌ని సీఎం తెలిపారు.

ఢిల్లీలో యమునా నీటి మ‌ట్టం 208.46 మీట‌ర్ల స్థాయికి చేరుకున్న‌ది. సీఎం కేజ్రీవాల్ ఇంటి చుట్టు కూడా యమునా న‌ది నీరు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. సెక్రటేరియేట్ క్యాంప‌స్‌లోనే కేజ్రీవాల్ ఇళ్లు ఉన్న‌ది. ఆ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, సీనియ‌ర్ అధికారుల ఇండ్లు కూడా అక్క‌డే ఉన్నాయి. రాజ్‌ఘాట్ నుంచి సెక్ర‌టేరియ్‌కు వెళ్తున్న రోడ్డు జ‌ల‌మ‌యం అయ్యింది. య‌మునా బ్యాంక్ మెట్రో స్టేష‌న్‌ను క్లోజ్ చేశారు.

వీడియో ఇదిగో, భారీ వరదలకు ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్, యమునా నది ఉగ్రరూపానికి రోడ్ల మీద ఎక్కడికక్కడే నిలిచిపోయిన నీరు

ఢిల్లీలోని పాత రైల్వే వంతెనే వద్ద యమునా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. యమునా ఉప్పొంగడంతో సమీప ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోని నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సివిల్ లైన్స్ ప్రాంతంలో రింగ్ రోడ్డు పూర్తిగా నీటమునిగింది. కశ్మీరీ గేట్ – మంజు కా తిలాని కలిపే ప్రాంతంలో భారీగా వరద చేరి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), ఢిల్లీ అసెంబ్లీకి కేవలం 500 మీటర్ల దూరంలో మాత్రమే ఉంది.

మరోవైపు భారీ వర్షాలకు తోడు వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సహాయక చర్యల నిమిత్తం 12 ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలను రంగంలోకి దింపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

యమునా నది ప్రళయంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో స్థానిక ప్రజలను ఖాళీ చేశారు. వారిని సహాయక శిబిరాలకు తరలించారు. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. వరదల ప్రభావంతో మరో రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నది ఒడ్డున ఉన్న ప్రాంతాలు యమునా బజార్, ప్రసిద్ధ టిబెటన్ మొనాస్టరీ మార్కెట్, నిగంబోధ్ ఘాట్‌లో దహన సంస్కారాలను నిలిపివేశారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif