Treatment in Delhi: దిల్లీలో ఇతర ప్రాంతాల వ్యక్తులకు వైద్యం ఇకపై కేంద్రీయ వైద్యశాలల్లోనే! రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం కేవలం దిల్లీ వాసులకే అందిస్తాయని ప్రకటించిన సీఎం అర్వింద్ కేజ్రీవాల్

ఇకపై దేశ రాజధానిలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులు కేవలం దిల్లీ వాసులకు మాత్రమే చికిత్స అందిస్తాయని, ఇతర ప్రాంతాల వ్యక్తులకు వైద్యం అందుబాటులో ఉండదని దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు....

Delhi CM Arvind Kejriwal (Photo Credits: ANI)

New Delhi, June 7:  దేశరాజధానిలో కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించే విషయం సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై దేశ రాజధానిలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులు ఎలాంటి వైద్య సేవలైనా కేవలం దిల్లీ వాసులకు  మాత్రమే చికిత్స అందిస్తాయని, ఇతర ప్రాంతాల వ్యక్తులకు వైద్యం అందుబాటులో ఉండదని దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు.  రాజధానిలో మరిన్ని లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తూ, సోమవారం నుంచి దిల్లీ సరిహద్దుల ద్వారా అంతర్రాష్ట్ర రాకపోకలకు అనుమతిస్తున్న సందర్భంలో కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు.

కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఆసుపత్రులు మాత్రం అందరికీ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

ఇతర నగరాలు, ఇతర ప్రాంతాల నుంచి వైద్యం కోసం దిల్లీకి వచ్చే రోగులకు ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రులలో ఎక్కడా కూడా వైద్యం లభించదని దిల్లీ సీఎం స్పష్టం చేశారు. అయితే కొన్ని అసాధారణమైన న్యూరో సర్జరీల కోసం మాత్రం దిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేసుకోవటానికి వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

Here's the Delhi CM announcement: 

కరోనావైరస్ సంక్షోభం సమయంలో 90 శాతం మంది ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులే దిల్లీలో వైద్యం కోసం వచ్చి ఇక్కడి ఆసుపత్రుల్లో నిండిపోతున్నారని, ప్రస్తుత కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దిల్లీకి ఆరోగ్య మౌలిక సదుపాయాలు అవసరమని. అందుకే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్లీ సీఎం వెల్లడించారు.

సీనియర్ సిటిజన్లు, చిన్నపిల్లలు ఎక్కువగా వైరస్ సంక్రమణకు గురవుతున్నారు. కాబట్టి వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య అవసరాలు స్థానికంగా కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులన్నీ దిల్లీ వాసుల వైద్యానికే కేటాయించామని కేజ్రీవాల్ చెప్పారు.