Delhi: ఢిల్లీ జామా మసీదులో అమ్మాయిల ప్రవేశంపై నిషేధం ఎత్తివేత, ఆదేశాలను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించిన మసీదు షాహీ ఇమామ్ బుఖారీ
లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మసీదు షాహీ ఇమామ్ బుఖారీతో మాట్లాడి.. మసీదులోకి అమ్మాయిల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఇచ్చిన ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని కోరారు.
ఢిల్లీలో గల జామా మసీదులోకి అమ్మాయిల ప్రవేశంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మసీదు షాహీ ఇమామ్ బుఖారీతో మాట్లాడి.. మసీదులోకి అమ్మాయిల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఇచ్చిన ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆదేశాలను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారని రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి.
అంతకు ముందు మసీదులో అమ్మాయిల నిషేధంపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజించే హక్కు పురుషుడికి ఎంత ఉందో.. స్త్రీకి అందే ఉందన్నారు. జామా మసీదు ఇమామ్‌కి నోటీసు జారీ చేస్తానన్నారు. మహిళల ప్రవేశంపై నిషేధించే హక్కు ఎవరికీ లేదన్నారు.
Tags
ban
DCW
Delhi
Delhi Commission for Women
Entry Ban Jama Masjid
Jama Masjid revokes ban
Jama Masjid revokes ban on girls' entry
LG VK Saxena intervenes
LIve breaking news headlines
Maulana Syed Ahmed Bukhari
Men
Shahi Imam
అమ్మాయిల ప్రవేశం
జామా మసీదు
ఢిల్లీ
మసీదు షాహీ ఇమామ్ బుఖారీ
లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా