Coronavirus disease (COVID-19): కరోనా పేషెంట్లకు మరో ముప్పు, వారి బాడీలోకి మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల వైరస్, ఆశ్చర్యపోతున్న వైద్యులు

కొవిడ్ రోగులకు ( Covid patients) మలేరియా, డెంగ్యూ (Dengue, malaria) వంటి సీజనల్ వ్యాధులు కూడా సోకుతున్నట్టు ఢిల్లీ వైద్యుల పరిశోధనలో (Delhi Medical Research) తేలింది. కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన వారిలో సీజనల్ వ్యాధుల లక్షణాలు కూడా కనిపించడంతో పరీక్షలు చేసిన వైద్యులు ఫలితాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలామంది కరోనా రోగులకు డెంగ్యూతోపాటు మలేరియా కూడా సోకినట్టు నిర్ధారణ అయింది.

coronavirus ward in hospital

New Delhi, Sep 6: కరోనావైరస్ (Coronavirus disease (COVID-19) బారినపడి విలవిలలాడిపోతున్న ప్రజలకు మరో షాకింగ్ లాంటి వార్త బయటకు వచ్చింది. కొవిడ్ రోగులకు ( Covid patients) మలేరియా, డెంగ్యూ (Dengue, malaria) వంటి సీజనల్ వ్యాధులు కూడా సోకుతున్నట్టు ఢిల్లీ వైద్యుల పరిశోధనలో (Delhi Medical Research) తేలింది. కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన వారిలో సీజనల్ వ్యాధుల లక్షణాలు కూడా కనిపించడంతో పరీక్షలు చేసిన వైద్యులు ఫలితాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలామంది కరోనా రోగులకు డెంగ్యూతోపాటు మలేరియా కూడా సోకినట్టు నిర్ధారణ అయింది.

ఓ వ్యక్తి ఇటీవల తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. దీంతో డెంగ్యూ పరీక్ష నిర్వహించగా అతనికి పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. అలాగే మరో యువకుడికి కరోనాతోపాటు మలేరియా కూడా సోకినట్టు గుర్తించారు. ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు వ్యాధులు ఒకేసారి సోకడంతో చికిత్స విషయంలో ఏ వ్యాధికి చికిత్స అందించాలో తెలియక వైద్యులు అయోమయంలో పడ్డారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు ఢిల్లీ ఎయిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రగ్యాన్ ఆచార్య తెలిపారు.

తాజాగా 90,633 మందికి కరోనా వైరస్, దేశంలో 41,13,812కు చేరుకున్న మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య, ఒక్కరోజే 1065 మంది మృత్యువాతతో 70,626 కు చేరిన మరణాల సంఖ్య

చాలామందిలో కరోనాతో పాటు డెంగ్యూ, మలేరియా కూడా సోకినట్టు నిర్ధారణ అయినట్టు సీనియర్ వైద్యుడు ఒకరు తెలిపారు. కొందరిలో డెంగ్యూతోపాటు మలేరియాను కూడా గుర్తించినట్టు చెప్పారు. అయితే కరోనా వచ్చిన అందరికీ డెంగ్యూ, మలేరియా వస్తుందని కచ్చితంగా చెప్పలేమని ఆయన స్పష్టం చేశారు. ఇది జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి మరియు రక్తస్రావం కలిగించే బాక్టీరియా సంక్రమణగా గుర్తించారు.

మలేరియాతో బాధపడుతున్న రోగులలో 44% మందికి డెంగ్యూ ఉందని ఈ అధ్యయనంలో కనుగొన్నారు. ఇది ఇటీవల ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించబడింది. రోగికి మలేరియా మరియు డెంగ్యూ రెండూ ఉన్న కొన్ని కేసులను కనుగొన్న తరువాత మేము ఈ అధ్యయనం చేయడం ప్రారంభించాము. కో-ఇన్ఫెక్షన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉందని మాకు తెలియదని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో బయోకెమిస్ట్రీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రగ్యాన్ ఆచార్య అన్నారు. కాగా కోవిడ్ ఇతర ఇన్ఫెక్షన్లను భర్తీ చేయలేదనే విషయం వైద్యులు మరచిపోకూడదని ఆయన అన్నారు. దీనిపై మరింత పరిశోధన జరగాలని తెలిపారు.