Gurmeet Ram Rahim Singh: మహిళల్ని రేప్ చేసిన డేరా బాబా బయటకు, 21 రోజుల ఫర్లాగ్ జారీ, పంజాబ్ ఎన్నికలను శాసించనున్న డేరా సచ్ఛ సౌధా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్
ఆయనకు 21 రోజుల సెలవును హర్యానా ప్రభుత్వం ఈరోజు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో, ఆయన (Gurmeet Ram Rahim Singh) ఈ సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
Chandigarh, February 7: రెండు దశాబ్దాల క్రితం నాటి మర్డర్ కేసుతో పాటు ఇద్దరు మహిళలను రేప్ చేసిన కేసుల్లో రోహ్ తక్ లోని సునారియా జైల్లో డేరా బాబా జీవితఖైదును అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు 21 రోజుల సెలవును హర్యానా ప్రభుత్వం ఈరోజు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో, ఆయన (Gurmeet Ram Rahim Singh) ఈ సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో డేరా బాబాకు (Dera Sacha Sauda Chief Gurmeet Ram Rahim Singh) సెలవు మంజూరు చేయడం గమనార్హం. పంజాబ్ లో డేరా బాబాకు పెద్ద సంఖ్యలో మద్దతుదారులున్నారు. ఏ ఎన్నికలను అయినా వారు ప్రభావితం చేసేంత పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలు రామ్ రహీమ్ కు చెందిన డేరా నేతలతో సాన్నిహిత్యంగా మెలుగుతుంటాయి. డేరా బాబా విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన అనుచరులు ఆనందంలో మునిగిపోయారు. ఆయనకు భారీ స్థాయిలో స్వాగతం పలికేందుకు వారు సిద్ధమవుతున్నారు
2017లో అత్యాచార కేసులో ఇరవై ఏళ్ల శిక్ష, మేనేజర్‌తో పాటు ఓ జర్నలిస్ట్ హత్య కేసులో డేరా సచ్ఛ సౌధా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జీవిత ఖైదు విధించింది పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. అప్పటి నుంచి హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా సునారియా జైలులో ప్రస్తుతం డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో జైళ్ల శాఖ అధికారులు 21 రోజుల ఫర్లాగ్ ( Granted 21-Day Furlough) జారీ చేశారు. ఇంతకు ముందు తన మెడికల్ చెకప్‌ల కోసం, ఆరోగ్యం బాగోలేని తల్లిని చూసుకోవడానికి 54 ఏళ్ల డేరా బాబాకు ఎమర్జెన్సీ పెరోల్ (సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం) వరకు మాత్రమే జారీ అయిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇప్పుడు 21 రోజులపాటు ఫర్లాగ్ జారీ కావడం విశేషం. చట్టం ప్రకారం ఫర్లాగ్ ప్రతీ ఖైదీ హక్కు.. అందుకే ఆయనకు జారీ చేశాం అని హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్‌సింగ్ చౌతాలా తెలిపారు. అయితే ప్రత్యేకించి కారణం ఏంటన్నది మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. కాగా పంజాబ్ మాల్వా రీజియన్‌లో డేరా బాబాకు ఫాలోవర్లు ఎక్కువ. పైగా పంజాబ్ అసెంబ్లీ 117 స్థానాల్లో.. 69 మాల్వా రీజియన్‌లోనే ఉన్నాయి. ఇక హర్యానా బీజేపీ పాలిత రాష్ట్రంకాగా.. డేరా బాబా ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఎలాగైనా పంజాబ్‌లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న వాదన ఇప్పుడు తెర మీదకు వచ్చింది.
ఇదిలా ఉంటే డేరా సచ్ఛ సౌధా మద్దతుతోనే 2007లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాన్ని సాధించింది. డేరా బాబా జైల్లో ఉన్నప్పటికీ.. ఆయన అనుచరులు మాత్రం భారీ ఎత్తున్న కార్యక్రమాల్ని నిత్యం నిర్వహిస్తూ.. సోషల్ మీడియాలో డేరాబాబాను, డేరా సచ్ఛ సౌధాను ట్రెండ్ చేస్తూ ఉంటారు.